పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/302

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

289

"I have got your letter about Sreeramulu. What he said is all lie. So you must tell him to go to Cocanada back & there is no use of threatening by running away like this and also tell him to come to me and ask me." (శ్రీరాములనుగూర్చి మీయుత్తరము చేరినది. అతఁడు చెప్పినదంతయు అబద్ధము. కాఁబట్టి కాకినాడకు తిరిగి వెళ్లవలసినదనియు, ఈలాగున పాఱిపోవుటవలన బెదరించిన ప్రయోజనములేదనియు, మీరతనితో చెప్పవలెను. నావద్దకువచ్చి నన్నడుగుమని కూడచెప్పుఁడు). రామకృష్ణయ్యగారిని బెదరించినప్పుడాయన మంచి మాటలతో వారి నాదరించి ధనమిచ్చెడువాఁడు; నన్ను బెదరించినప్పుడు నేను కోపవాక్యములుపలికి యనాదరముచూపి యేమియు నియ్యకుండెడి వాఁడను. మాయిరువుర స్వభావములలోను గలభేదమిది.

చదువంతగాలేని మూఢులవలన ధనవిషయమయి మాకు చిక్కులు కలుగుచువచ్చినను వారియాశ లత్యధికములయినవి కానివిగాను, అవి యత్యల్పముతోనే తృప్తినొందునవిగాను, ఉన్నవని యొప్పుకొనవలసియున్నది. ఇఁకవిద్య నేర్చినవారిలోనో యివి విపరీతములుగానుండినవి. వారియాశలకు పరిమితిలేదు; సామాన్యలాభముచేత వారికి తృప్తిలేదు. వారిలో కొందఱు స్వప్రయోజన పర్వతమును సహితము పరోపకారార్థమే యయినట్టు చూపఁగల శక్తిమంతులు. రామకృష్ణయ్యగారి వలనను సమాజము వారివలనను ధనస్వీకార మధికముగాచేసినవారును చేయ ప్రయత్నించినవారును చదువులేక సంపాదించుకో శక్తిలేని వారిలోకంటె చదువుకలిగి సంపాదించుకో శక్తిగలవారిలోనే యధికముగానుండిరి. ఇటువంటి విషయములనుగూర్చి చెప్పుట నాకును వినుట యితరులకును హృద్యముకాకపోయినను కొందఱు మహానుభావు లిప్పటికిని విషయములను విపరీతముగా పత్రికలలో తెలుపుచుండుటవలన సత్యము లోకమునకు తెలియుటకయి యొకటిరెండు సంగతుల నిచ్చటఁ బేర్కొనవలసివచ్చి నందుకు చింతిల్లుచున్నాను. మూడవవివాహముచేసికొన్న రామారావుగారికి