పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/28

ఈ పుట ఆమోదించబడ్డది

ఒక వ్యక్తిగాగాక, ఒక సంస్థగా రాణించిన

దుర్గాబాయి

1920లో గాంధీజీ ఆంధ్రప్రాంతంలో పర్యటిస్తూ రాజమండ్రి వచ్చారు.

కాకినాడ నుంచి బంధువుల ఇంట్లో పెళ్ళికి తల్లిదండ్రులతోపాటు రాజమండ్రి వచ్చింది ఒక అమ్మాయి. ఆ రోజు సాయంత్రం రాజమండ్రిలో గొప్ప సభ జరిగింది. ఆ సభలో గాంధీజీ ఉపన్యసించారు. క్రిక్కిరిసిన జనం. సభలో వాలంటీర్లు హుండీలు పట్టుకుని తిరుగుతూ డబ్బులు వసూలు చేయడం చూచిందా అమ్మాయి. ఆ బాలిక వయస్సు 11 ఏళ్ళుంటాయి. వసూలుచేసే డబ్బు గాంధీగారి కాంగ్రెసునిధికి అని విన్నది. ప్రక్కనున్న ఒకాయనను గాంధీ టోపీ ఇమ్మన్నది. ఆ టోపీ చేత పట్టుకుని "గాంధీనిధికి డబ్బులివ్వండి" అంటూ జనం మధ్య తిరిగింది. టోపీ నిండింది. గుంపుల్ని తోసుకుంటూ గాంధీగారున్న వేదిక వద్దకు వెళ్ళాలని ఆ బాలిక ఉబలాటం. ఆయనకు తానే ఆ డబ్బులివ్వాలనుకుంది.

జనం తొక్కిసలాట. ఆ బాలిక "బాబూ నన్ను పోనివ్వండి. మహాత్మునికి పైకం ఇస్తా" అంటూ వుంది. ఆ బాలికను చూచి ముగ్ధుడైన ఓ పెద్దమనిషి, ఆ అమ్మాయిని భుజాలపై కూర్చుండజేసి, గాంధీజీ ముందు దించాడు.

"బాపూ - ఈ డబ్బులు తీసుకోండి" అన్నది. నవ్వుతూ అందుకుని "నీ చేతికున్న గాజులు కూడా ఇవ్వు" వెంటనే సంతోషంగా "బాపూ తీసుకోండి" అంటూ గాజులు రెండింటిని