ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

సుకవి మనోరంజనము


క.

ఆ గంగామాత్యు ఘన
త్యాగంబున సేతుహిమధరాంతరభూమీ
భాగాగతనిర్గతధర
ణీగీర్వాణులు రవిసుతునిన్ మెచ్చ రిలన్.

20


చ.

ఇనకులరత్నమౌ దశరథేంద్రుఁ డతంద్రితులైన రామల
క్ష్మణభరతారిహంత లనఁగా సుతులన్ గడు వేడ్కఁ గన్న రీ
తిని ఘనగంగమంత్రియును దిమ్మన సింగన జగ్గనార్య సూ
రన లను పుత్రులం బడసె సంచితమూర్తుల భవ్యకీర్తులన్.

21


వ.

అం దగ్రజుండు

22


సీ.

రాజశేఖరచరితము రుక్మిణీపరి
        ణయము నీలాపరిణయము సింహ
శైలమాహాత్మ్యంబు సప్తసాగరచరి
        త్రంబును సారంగధరచరిత్ర
రామాయణంబు సర్పపురమాహాత్మ్యంబు
        సర్వలక్షణసారసంగ్రహంబు[1]
రసికజనమనోభిరామంబు శ్రీశివ
        లీలావిలాసంబు లాలిత శత
కములు శ్రీకృష్ణదండకం బమలమతి ర
చించి నట్టి మహా ప్రతిభాంచితుండు
రమ్యకీర్తి తృణీకృతబ్రహ్మజిష్ణు
వైభవుఁడు తిమ్మసత్కవీశ్వరుఁడు దనరు.

23
  1. ఇక్కడ 'సర్వలక్షణసారసంగ్రహ' మని పేర్కొన్నను ముందుముందు గ్రంథమందంతట 'తిమ్మకవిగారి లక్షణసారసంగ్రహ' మనియే 'సర్వ' పద విరహితముగా వేంకటరాయకవి పేర్కొన్నాడు. నిజమునకు అది 'లక్షణసారసంగ్రహ'మే. చూ. ఆం. ప్ర. సాహిత్య అకాడమీ ప్రచురించిన 'లక్షణసార సంగ్రహ'మునకు నా వ్రాసిన సమీక్షణము.