ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నివేదన

కూచిమంచి తిమ్మకవి సార్వభౌముని 'లక్షణసార సంగ్రహము' నకు పరిష్కృత ప్రతిని సిద్ధముచేసి, 'సమీక్షణము'ను సంతరించి సమర్పింపగా నా పరిశ్రమను గుర్తించి, గ్రంథ గౌరవమును పురస్కరించుకొని 1971 లో ప్రచురించిన అం. ప్ర. సాహిత్య అకాడమీ వారు, ఈనాడు కూచిమంచి వేంకటరాయని ‘సుకవి మనోరంజనము'ను పరిష్కరించి సమాలోకనము' సమకూర్చు నవకాళము కలిగించుట వ్యకిగతముగా నాకెంతో సంతోషకర మైనది. ' కూచిమంచి ' లాక్షణికులకు, తద్ద్వార లక్షణరంగమునకు 'ఉడుతా భక్తి'గా సేవ జేయగల యదృష్ణము, మొకటి సారిగా ముద్రణ కెక్కు నీ గ్రంధమును పరిష్కరించు నవకాశము కలిగించినందులకు సాహిత్య అకాడమీ కార్యవర్గమునకు, సహృదయులు ఆకాడమీ కార్యదర్శి శ్రీ రామానుజరావు గారికి సర్వదా కృతజ్ఞుడను.

ఈ పరిష్కరణ కృషిలో, సమాలోకన రచనలో ప్రత్యక్షము)గానో, పరోక్షముగానో సహకరించిన గౌరవనీయులు డా. జి. యస్. రెడ్డి గారికి, మరియు శ్రీ ఆవంత్స సోమసుందర్, శ్రీ జి. కృష్ణ, శ్రీ నిడదవోలు సుందరేశ్వరరావు మొదలగు మిత్రులకు, ఆదినుండి నాకు తోడగు డా. కోవెల సుప్రసన్నాచార్యులకు నా ధన్యవాదములు.

నా కృషిఫలమునకు ప్రమాణమైన పండిత విమర్శకుల సహృదయతకు నా నమోవాకములు.

నాకు లక్షణ శాస్త్రమార్గమును చూపిన మా తండ్రిగారు శ్రీమాన్ కోవెల రంగాచార్యులుగారిని, నన్నొక దారిలో ముందుకు నడిపించిన గురువర్యులు బ్రహ్మ శ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మగారిని ఈ సందర్భమున భక్తి పూర్వకముగా సంస్మరింతును.

జగిత్యాల, కోవెల సంపత్కుమారాచార్యులు