ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రాఘవపాండవీయము (1-12)
సీ.

గంభీరవేదిలక్షణలక్షితంబునై
             తనరారు భద్రదంతావలములు
నారబ్ధసింధుగాంధారాట్టభవములై
             కొఱలు శ్రీవృక్షక ఘోటకములు
పదునాల్గు జాతుల త్రిదివకాంతల మీఱు
             పద్మినీజాతి సౌభాగ్యవతులు
కడునద్భుతములైన కనకరత్నాంశుక
             చందనాది సువస్తుసంపదలును
నఖిలదిగ్దేశభూపసమర్పితంబు
లగుచు నరణంబుగతిఁ దోన నరుగుదేఱఁ
దను వరించు జయశ్రీలఁ గొనుచు నతఁడు
పురికిఁ జనుసొంపు వాగగోచరతఁ బరఁగె.

74
సమర్పితము - ప్రాదియతి.[1]
ప్రాణపదము హల్లుకు
పోతరాజుగారి భాగవతము (అష్టమ-285)
క.

ప్రాణేచ్ఛ వచ్చి సొచ్చిన
ప్రాణుల రక్షింపవలయుఁ బ్రభువుల కెల్లన్
ప్రాణుల కిత్తురు సాధులు
ప్రాణంబులు నిముషభంగురము లని మగువా!

75
  1. ఇక్కడ 'ఈ పద్యార్థము తెలియుటకు ముద్దరాజు రామన్న గారు రచించిన వ్యాఖ్యానము వ్రాసుతున్నాము' అని ప్రారంభించి ఆ పద్యవ్యాఖ్య వ్రాసి, వ్యాఖ్యలో 'పదునెనిమిది జాతులు 'పేరులు మాత్రము వ్రాసినారు. ఏ జాతివలన నేజాతి పుట్టినదో అది వ్రాయలేదు. ఈ నిర్ణయము ముఖ్యముగా తెలియవలసిన దౌను' అని 'స్కందవురాణము' నుండి 11½ శ్లోకములు వ్రాయబడినవి. చివరి శ్లోకార్థభాగ మిది' —ఏవం సంకర వర్ణానాం జనానాం జన్మలక్షణమ్.’