ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అందే (4–148)
క.

వాసవనందనసఖుఁడగు
భూసురుఁ డొకఁ డరుగుదెంచి భూవినుతగుణో
ద్భాసితు ధర్మజు [1]డీప్రస
థాసీనుం గాంచి పలికెఁ బరమప్రేమన్.

137
అందే (5-289)
ఉ.

ఒక్కదినంబునందు బలియుండు సురారులనెల్లఁ దున్మి పెం
పెక్కి దయార్ద్రుఁడై యభయమిచ్చె జనంబులకెల్ల షణ్ముఖుం
డిక్కడ భక్తి తో వినిన నెప్పుడు కీర్తన చేసినం జనుల్
నిక్కము సర్వదోషముల నీగి భజింతురు భవ్యభద్రముల్.

138
చివర (చరణమునం దఖండయతి)
అందే (6–1)
క.

శ్రీ లలితమూర్తిసుమహ
చ్చాలుక్యవరేణ్య పుణ్యచారిత్ర విచి
త్రాలంకారోజ్వల [2]కలి
తాలాపకలాపసంతతస్మేరమతీ!

139
అందే (7-21)
సీ.

అయ్యలార జటాయు వని వల్కెదరు మీర
             లెవ్వరు చెప్పరే, యేను వాని
నగ్రజుండ, ననూరు నాత్మజన్ముల మేము
             సంపాతి నా పేరు సమ్మదమున
నేనును దమ్ముండు నినమండలమునకుఁ
             జన వేడ్క నొకనాడు చదల నెగసి
చనఁ జన తీవ్రాంశుసంతాపమునఁజేసి
             కమరె నాఱెక్కలు కమరవయ్యె

  1. ము. ప్ర. '... విప్రస
    ఖాసీనుంగాంచి యిట్టు లనియెం బ్రీతిన్'
  2. ము. ప్ర....కవి, తాలాపకలాపసంతతానందమతీ'