ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శసలకు ప్రాసములు మహాకవి ప్రయోగము లనేకము లుండగా అప్పకవి
"ఆంధ్రశబ్దచింతామణి" (2-258) యందు
సీ.

వికృతి పదాదిని వెలయు నాఱవ హల్లు
             మొదలి విభక్తి పైఁ గదిసెనేని
యరయఁ దృతీయోష్మమగు శౌరి సీరలు
             దాచిఁ గోపస్త్రీల నేఁచె ననఁగ
ప్రథమోష్మవర్ణంబు పరికింప తద్భవా
             ద్యంధ్రదేశోక్తులయందు లేదు
సింగంబు, సింగిణి, సెవమును, సెలగోల
             వాసెడు పసిగొనఁ జేసి రనఁగ
భీష్మ సన్నుత! యివి తృతీయోష్మలిపులు
గాని ప్రథమోష్మవర్ణము ల్గావు, దీని
దెలియక రచించు కృతులు ధాత్రీతలమును
బ్రాస భంగంబులై నగుబాటు చెందు.

184

       అని చెప్పినారు. మహాకవి ప్రయోగములు పరిశీలించనందున స్వపాండి
త్యమునకు నగుబాటనుకోక, శసలు ప్రాసలుగల కృతులు నగుబాటనుట గొప్ప
సామర్థ్య మగును.

(ఇక) నణలకు లక్ష్యములు
రుక్మాంగదచరిత్రము (4–46)
ఉ.

 ఏనుఁగు నెక్కి భేరి మొఱయించుచు నిస్సహణాది [1]భూరిని
స్సాణము లుల్లసిల్ల జలజాప్తకులేంద్రునియాజ్ఞ వీథులన్
మానుగఁ జాటువాక్యములు మానవనాయకుఁ డాలకించి బి
ట్టూనిన భీతిఁ గేల్వదలి యుగ్మలి కౌఁగిలి వాసి గ్రక్కునన్.

186
రెండవచరణమందు నఖండయతి
  1. ....భేరిని, స్స్వానము లుల్లసిల్ల జలజాతహితేందువిశాలవీథులన్