ఈ పుట ఆమోదించబడ్డది

20


నివ్వెర పడి యుండె - నెలత సుభద్ర
మరి యెన్నోరీతుల - మాయల తపసి
నెరవక తను జూడ - వెరగందె నబక్వ్ల
గ్రక్కున శ్రీ కృష్ణ - కడకు నేతెంచి
యెక్కడి యవి వరుం - డితడు వోయన్న
చూడ నయమి గాని - చూరకా డితడు
ఆడెడి మాటలి - ట్లని పల్క రాదు
సరస మాడగ వచ్చు - సారె నాతోను
సొంపు నొయ్యారంపు - చూపులే తరచు
ఇత్తరి నే భిక్ష - మిడి నత దాను
 పొత్తువ భుజియింప - పొలతి రమ్మనెను
ఎంత జేసితిరి మీ - రిటువంటి వారి
నంతఃపురమ్ములో - నర్యమా యుంచ
అన్న యీ సన్యాసి - ననుపుమా వేగ
ఎన్నిక బూజింప - నే దగవు గాదు
తన్ను జూడగ నిల్వ- తగవుగా దితడు
కటకట యిటువంటి - కపట సన్యాసి
నెటులవలె బూజింతు - నిందిరారమణ
అనిన నవ్వుచు గృష్ణు - డా యతీశ్వరుని
 వినయమ్ముతో బిల్చి - వేడ్క నిట్లనెను
అయ్య మీపనులన్ని - ఆగడాలాయె