ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొనగవలెఁ గాని యిది కుట్టుఁ డనుచుఁ
బొరుగువారల నడుగంగఁబోవరాదు. 98.

తే.గీ. సేవకుల నైనఁ దా నాజ్ఞ చేసినట్టు
లోరి యిదిచేయు వెూసి యనక,
అమ్మ యిదిచేయు మదిచేయు మయ్య యనుచు
వేడుకొనునట్లు చెప్పుట వెలఁది కగును. 99.

తే.గీ. చిన్ననాటనె పాకంబు జిహ్వ కింపు
గాఁగఁ జేయంగ నేరిచి కలువకంటి
ప్రతిదినము భోజనము నెల్ల వారలకను
వేళపట్టునఁ దప్పక పెట్ట వలయు. 100.

-:(0):-
తే.గీ. బాలికా పాఠశాలల నోలిఁ జదువు
చిన్నతరగతులం దున్న కన్నియలకుఁ
గాఁగ స్త్రీ నీతిదీపిక నాఁగ దీని
కందుకూరి-వీరేశలింగము రచించె. 101.

సంపూర్ణము.

బాక్సు ముద్రాక్షరశాల. రాజమండ్రి