పుట:Srivijayendravijayam by Aadipudi Somanaadharaaya.pdf/4

ఈ పుట ఆమోదించబడ్డది

విన్నపము.


అభినవాంధ్ర భోజుఁ డనందగు శ్రీ పిఠాపురము రాజాగారు నూతనముగా నీసంవత్సరమునుండి యేర్పాటుఁజేసిన యాంధ్రప్రబంధపరీక్షకుఁ బంపునిమిత్తము మిక్కిలి యుత్సాహముతో నీప్రబంధమును రచించితిని. నాగృహకృత్యములయందుఁ గొన్ని యనివార్యములు తటస్థించినందున ఆగస్టు 5 వ తేదిని బ్రారంభించి యీ ప్రబంధమును 26 వ తేది రాత్రి 8 ఘంటలకు ముగింపఁగలిగితిని. కాని నియమితదినమునకంటె నొకదిన మాలస్యమైనందున నాయీ ప్రబంధమునకు నాపరీక్షలోఁ జేరు సౌభాగ్యము గలిగినదికాదు. కాఁబట్టి దీనిని నేను స్వతంత్రించి ముద్రింపించితిని. ఏలాగైననేమి శ్రీరాజాగారి ప్రకటనయే నాకీప్రబంధమును రచించుటకు బ్రోత్సాహమును గల్గించినది గనుక నేనెంతయు శ్రీవారికిఁ గృతజ్ఞుడ నై యున్నాఁడను. దీనిం జదువువారు దీనియందలి గుణములనుమాత్రము గ్రహియించి దోషంబులను బరిత్యజింతురుగాక!

పిఠాపురము

1-9-11

ఇట్లు విన్నవించు

సజ్జనసేవఁకుడు

ఆ. సోమనాథరావు.