పుట:Srivemanayogijiv00unknsher.pdf/30

ఈ పుట ఆమోదించబడ్డది

యుచు ప్రత్యక్షములై భాసిల్లిన యవి ఒక్కవేదవేద్యమగు నధ్యాత్మవిద్యమాత్రమే గాక ఎన్నియో యుగములు గురుశుశ్రూషల జేసి తదనుగ్రహమునను స్వానుభవమువలనను తెలియదగిన లోక తంత్రములన్నియును బొడకట్టినవి. ఇంతయేల వేమన్నకు తత్వోపదిష్టుడైనపిమ్మట దెలియనిమతధర్మములుగాని రాజనీతిగాని ప్రజాతంత్రముగాని పారలౌకికానుసంధానమగు నధ్యాత్మవిద్యగాని భూతభవిష్యద్వర్తమానకాలములలో నెచ్చటనెప్పుడైన జఱిగిన జఱుగగల జఱుగుచున్న సమాచారములలో గాని తెలియనివి యెక్కడను లేకుండెను.

వేమన్నకు విద్యాసాక్షాత్కారమైన యట్టులే కృతఘ్నతాభయ సాక్షాత్కారము గూడ కాజొచ్చెను. కావున చాలవిచారపడి వెనుకకు మఱలివచ్చి దుకానములో నింకనుపనిచేయుచునే కూఱుచున్న యభిరామయ్యను చేరవచ్చి యాతని చుట్టునున్న నంగడి పనిముట్లను దూరముగా బాఱవైచి సాగిలబడి యభిరామయ్యపాదములను గట్టిగా బట్టికొని "మహానుభావా! క్షమింపవలయును. మీయెడ గొప్పతప్పు నొనరించితిని. మీదాసుడను గాన నేనుచేసిన తప్పును క్షమించితినను నంతవఱకు మీ పాదములను విడువను." అనియెను. అభిరామయ్యయును వెలవెలబోయి "ఇదియేమి" అని నయభయ