పుట:Srivemanayogijiv00unknsher.pdf/19

ఈ పుట ఆమోదించబడ్డది

భాగ్యమున కింతగా విచారింపవలెనా లే లెమ్ము! ఇచ్చెదను. దీసికొనిపోయి నీయిష్టము దీర్చికొనిరమ్ము కాని నాకు నీవొక విషయమున ప్రమాణమును చేయుము. ఈయలంకారము నావెలయాలు ధరించికొన్న తఱువాత దానిని నగ్ననుకావించి ప్రతియ నయవమును చక్కగాపరికించి విశేషముల నాకు చెప్పవలయును అనిపలికి ప్రమాణమును చేయించికొని వేమన్న నంపెను.

పిమ్మట వేమన యత్యంతము కుతూహలావిష్టుడై ఆవారాంగనగృహాంగణము బ్రవేశించి దాని కొసగి యలంకరించికొను మనియెను. అదియును లేచి లేనిముసిముసినగవుల నగుచు అలంకరించికొని ఎదుటనిలచెను. వేమన్న తత్క్షణమే దానిని విగతవస్త్రగావించి పరికించిచూచి యసహ్యత జెందెనట. ఇదియే మన వేమా రెడ్డిగారు వేమన యోగిగా మారిపోవుట కంకురార్పణము చేసినసమయము. అప్పుడు వేమన విషయవాసనల దెగడి "ఇన్నిదినములు వ్యర్థుడనై ఈముఱికికూపములో బడి యుంటినే గానితరణోపాయము గానలేకపోయితిని గదా ఛీఛీ నిష్ప్రయోజకుడను" అనినిందించికొనుచు మితిమీరిన విచారముచేత ఇంటికిజని యెవ్వరికి నగుపడకయుండ నొకగదిలో పరుండెను. భోజన సమయమునకు వేమనరానందున నరసాంబగారు