పుట:Srivemanayogijiv00unknsher.pdf/17

ఈ పుట ఆమోదించబడ్డది

జ్యము నొందెను. ఇట్టిసమయములో ప్రకృతచరితమునకు సంబంధియగు కోమటివేమారెడ్డిభార్య నరసాంబ, ఈమె యమేయ ప్రభావ సమన్వితయగు పతివ్రత గుణవతియు నై యుండెను. రాజ్యపాలన భారమును వెంకారెడ్డివహించెను. ఇతని తమ్ముడును మన కథానాయకుడు నగు వేమన్నగారు ఇల్లువాకిలి, పిన్న పెద్ద, కష్టముసుఖము అనువిషయముల నించుకయైన యోచింపక తనయిచ్చ వచ్చినట్టులు అల్లరిచిల్లర వాండ్రతో చేరి తిరుగుచు పెండ్లిపేరంటమును వదలుకొని ప్రమత్తుడై యుండి కొన్నిదినములకు ఒకబోగముదాని నుంచికొని దానితో నిష్టగోష్టి ననుభవించు చుండెనట. సరి. ఇకపైనిచెప్పవలసిన దేమియున్నది, అసలే వెలయాలు అందునను ధనపిశాచి అచ్చటను రాజేబొజగు అయినచో నాతని రాబట్టి తనకు పాదసంవాహన మొనర్చు దాసునిగా చేసికొని యిల్లు గుల్లజేయించు స్వభావముగలది కదా! అందులో నికయిల్లేపట్టక పెల్లుగాస్వతంత్రతను వహించినవానిని బొంగరమువలె త్రిప్పుటలో వింతయేమున్నది? మన వేమన్నగారు మామూలు ప్రకారమొకనాడు తాను ప్రేమనిధానమని యెన్నుకొనుచున్న వేశ్యయింటికి బోగా నాపె యతివినయ వినమితమై చేరవచ్చి "నాముద్దు నొకదానిని చెల్లింపవలయును, అట్లుచేసిననే నేను జీవించెదను, లేకున్న లేదనిపల్క గట్టి