ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దాని కేళీమందిరద్వారమునొద్దకుఁబోయి నిలిచియుండెను. క్రొత్తవిటకానికడఁ బొగులుచుండిన వేశ్య వెలుపలికి వచ్చి యట మలహణు నునికి యెఱుఁగక పుక్కిలించి యుమిసెను. ఆ యెంగిలినీ రక్కడ నిలిచియున్న మలహణునిపైఁ బడెను. ఇంతలో మిన్ను మెఱయ నావెలుఁగున నతనిఁ గుర్తించి యా బోగముచాన వగచి చెంతకుఁబోయి కౌఁగిలించుకొని యాతని నూఱడించెను. మరియుఁ దమ యిష్టార్థమును బడయ శివునిఁ బ్రార్థింప నాతనిఁ బురికొల్పెను. అంత వా రిరువురు శివాలయమును చేరిరి. అచట వేశ్య మలహణుని వీపునాని కౌఁగిలించి నిలిచియుండెను. అపుడు మలహణుఁడు భక్తిమీఱ 'కాంతాకచప్రచయ” అని ప్రారంభించి ముప్పదియాఱు శ్లోకములతో శివుని స్తోత్రము చేసెను. శివుఁడు మెచ్చి యాయిరువురకును, వేశ్యమాతకును శివలోకము నసుగ్రహించెను."

ఈకథనే ఎఱ్ఱన యిట్లు మార్చి పెంచి ప్రబంధముగా రచియించియుండవచ్చును. మఱియు నిందు జాతి నీతిగల వేశ్యలపొందువలన హానికలుగదనుటకు దృష్టాంతముగాఁ జెప్పిన శ్వేతునికథయుఁ బండితారాధ్యచరిత్ర (ద్వితీయప్రకరణము) యందున్నదియే. అదియు నిట గొంత మార్పును గాంచి వెలసినది.

ఇది శివభక్తిప్రధాన మగు గ్రంథ మయినను నాయికానాయకుల విప్రలంభసంభోగశృంగారము లంగములై యిం దందముగఁ బెంపొందినవి. వేశ్యలమాయలు, వలపుకత్తెలు పురుషులను దమవలలో వైచికొను నుపాయములు చమత్కారముగ