ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వీడు చేరె ననుచున్నారు. ఈ సంవత్సరముతో కుమారగిరి రెడ్డి పరిపొ లన మించుమించుగాఁ దుదమట్టినదని , నక్కాణింపవచ్చును. ఇంకొక విచిత్రమైన వ్రాత వ్రాసిరి. " కాటయ వేమన క్రీ. శ. 1398 ( పొంతముల రాజమహేంద్రవరము చేరినాఁడు. విద్యారసికుఁడగు కాటయ వేమన నా కాలమం దీతఁడు దర్శించియుండవచ్చును. సకలవిద్యాసనా థుఁ డగుచున్న యీ ప్రతిభాశాలి నాతఁ డాదరించియు నుండవచ్చును" అని వ్రాసియున్నారు. అనగా శ్రీనాథుఁడు 1398 దవ సంవత్సర కాటయవేముని రాజమహేంద్రవరములో సందర్శించెననియు నంతకుఁ బూర్వము సందర్శించి యుండ లేదని వారి భామని స్పష్టపడుచున్నది గనుక 1400 వఱకు గొడవీడుకు చేరలే దనుటగూడ వారియభి ప్రాయ మైనట్టు స్పష్టమగుచున్నది. మఱియుఁదనకుఁ జేసిన మేలును, చూపిన యాదరణ గౌరవములను నవసానకాలమునఁ గూడ మఱపింపఁ జేయక స్మరింపఁ జేయునట్టి తన మిత్రులను ప్రభుపుంగవుల నొక్కొక్కరినే తలంచుకొని శ్రీ నాథుఁడు చెప్పినాఁ డన్న పద్యములో “భాస్కరుఁడు మున్నే దేవుని పాలికరిగె నన్న పాదములో ప్రశంసింపఁబడిన భాస్కరుడు కాటయ వేమునిమంత్రియగు రాయని భాస్కరుఁడే యనియు నతఁడు శ్రీనాథున కాలంబముగా నుం డె ననియు,


చ. కలయఁ బసిండి గంటమున గాటయ వేమ సమక్షమందు స
త్ఫలముగ రాయస ప్రభుని బాచుఁడు వ్రాసిన వ్రాల మోతలున్
గణంగలు గల్లు గల్లురనగ గంటకషరంగ్రుల గుండెలన్నియున్
జలు జల జల్లు జిల్లురను సత్కవీ వర్యులు మేలు మేలనన్".


అను చాటువు రాయని భాస్కరుని పై శ్రీనాథుఁడు చెప్పినదేయని మా మిత్రులగు శాస్త్రులవారు వ్రాయుచున్నారు.కాటయ వేమా రెడ్డి వంటి విద్వత్ప్రభువును, రాయని భాస్కరునివంటి విద్వన్మంత్రిని రాజమహేం దవరమున విడిచి పెట్టి రాజాశ్రయమున కై , నియోగి ప్రముఖుల యాద