ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్ధాధ్యాయము

77


సింహాచలపర్యంతము గల దేశమును బరిపాలనము చేసెను.*[1].. అన వేమభూ పాలుఁడు తన తండ్రి వహించిన జగనొబ్బగండ డాదిగాఁగల బిరుడములను మాత్రమే గాక వసంత రాయఁడను బిరుద మును గూడ వహించెను. అన వేమభూపతి హేమాద్రి దానాధికుడై దారిద్ర్యవిద్రావణుఁ డై శిబికర్ణదధీచులం బో లేఁ బ్రసిద్ధి గాంచెనఁట. ఇతని దానశాససము లాంధ్ర దేశమునం దంతటను గలవు. గ్రంథవిస్త రభీతిచే వానినిట నుదాహరింప మానుచున్నాఁడను. అనవేమభూపా లుఁడు విద్యాభిమానియనియు, బడిత పక్షపాతియనియు, కవుల పాలలి టి కల్పతరువనియు, చాటు చాటు పద్యముల వలసను శ్లోకములనలనను వేద్య మగుచున్నదిగా నీ యితఁడు గాని యితని యన్న యసపోత రెడ్డిగాని కృ నొందిన గ్రంథము లెవ్వియుఁ గాన కావు.

అనవేమ రెడ్డికి సమకాలికుఁ డైన రేచర్ల అనపో తనాయునికి మను మనమ డయిన అనపోత నాయుఁడు, అన వేమ రెడ్డిని యుద్ధములో సంహరించి పట్టుతలాటాంక బిరుదమును బొందెనని వెలుగోటి వారి వంశ చరిత్రము చెలుపుచున్నది గాని యది విశ్వాసపాత్రముగాదు. వానికి సమకాలికుడైన మొదటి ఆనపోతనాయుఁడు చం పెనన్న విశ్వసింపపచ్చును. లేదా అతని కుమారుఁడు సింగమనాయుఁడు చంపె నన్నను విశ్వసింపవచ్చును. అనవేముఁడు చనిపోయిన ముప్ప దేండ్లకు' వెనుక నున్న రెండవ యసపోతనాయుఁడు చంపెనన్న నంత విశ్వాసపాత్రము గాఁ గనుపట్టదు. మఱియు మఱియొక స్థలమున సింగసమాధ వేంద్రుని మునిమనుమఁ డగు సింగమనాయఁడు. అన వేమరెడ్డిని సంహరించి సిం హతలాటబిరుదము బొందెనని పై వేణుగోటి వారి వంశచరిత్ర మే దెలు

పుచున్నది. మొదటిది వాస్తవమా? ఈ రెండవది వా స్తవమా? మొదటి

  1. తస్యా బ్రాతా నీఘృత వత్స తాపోద సేంద్ర వ్యాప్త నీరంద్రకీర్తి ! శ్రీవెల నారసింహడెల తత్:క్ష్మాం దత్తోధర్మేణాన నేమక్ష్మీ శతీశ!!