ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చముర్థాధ్యాయము

75


అనపోత రెడ్డికిఁ దరువాత. గూడా నీనౌకాభివృద్ధి గాంచినట్లనేక దృష్టాంతములు గనుపట్టు నున్నవి. ఈతని పరి పాలనము సర్వజన రంజక మై యున్నవనుటకు సందియము లేదు. ఈశాననము క్రీ. శ.1385 న వ్రాయః బడినది, మోటుపల్లి ముకుళ పురమని వ్యవహరింపం బనుచున్నట్లుగా " బై శాసనముమునఁ దెలియుచున్నది. అనపోత రెడ్డి పరి పాలనము చేసినది పండ్రెండు సంవత్సరములు మాత్రమే. ఇతఁ డేకా రణము చేతనో అకాల మృతికొంచెను. ఇతఁ డింకను బదికి యుండిన యెడల రెడ్డి రాజ్యమును విస్తరింప జేసే కర్ణాటక సామాజ్యము వలె నొక ఘనసామ్రాజ్య మును దక్షిణ హిందూస్థానమున స్థాపించి యుండు ను. ఇతనికి కుచూరగిరి రెడ్డి యకు కుమారుడును, ముల్లాంబ యను కొమార్తయుఁ గలరు. మల్లాంబను తన మేల్లుడగు "కాటయ వేమన కి చ్చి వివాహము గావించెను.


దక్షిణపు సరిహద్దుననున్న యుదయగిరి రాజ్యము కర్ణాటాధీ శులవశ్యమై వారి పరిపాలనమునఁ బనర్థ మూసమై యొప్పుచున్నందున నెప్పటిక కైనఁ దన రాజ్యమునకు మొప్పము రాగలదని యూహించి తన్నివారణ మార్గముల నారయుచుండెను. నూత్న కర్ణాటసామ్రాజ్యాధీ శ్వరుల పుత్రులును, యుపరాజులు నగువారు తఱుచుగా సుదయగిరి దుర్గ మున నంచుచు నుదయగిరి రాజ్యమును బరి పాలము సేయుచుండిరి, అట్టి యుదయగిరికి సమీపమున' దన రాజధాని యుండుట రాజ్బ వినాశమునకు హేతువగు కుననియో, పద్మనాయక వీరులు తరచు ధాన్య వాటీనగరము పై డండయాత్రలు సలుపు చుండుట చేత తన ముఖ్య పట్ట ణ ము ధాన్య వాటిపుర మునకు సమీపముననుండుటయుచితమనియేచించియో అనపోతభూ పాలుఁ డుశత్రువు , కబేద్యయగు కొండవీడు నకు తన రాజధాని మార్చుకొనియెను.

గోవావరీ మండలములోని యొక శాసనము , అనపోత రెడ్డి