ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్ధాధ్యాయము

67


1323 వ సంవత్సరమునఁ దురుష్కులు 'కాకతీయసొమాజ్య మును విధ్వంసము గావించి వెనకఁ బంటకులంబున జనించినట్టి దేపటి వేమా రెడ్డి మనుముఁడును ప్రోలయ రెడ్డి రెండవకొడుకును నగు వేమారెడ్డి యాక్యధర్మోద్ధరణాభిలాషియై తురుష్కు లార్యధర్మముల నాంధ్ర దేశంబునం దాటాదూటములుగఁ జేయుచుఁ గలవరు పెట్టుచున్న కాలం బున వికమాడ్యుఁడై కృష్ణానదీ తీర ప్రాంత దేశములఁ దురుష్కుల నోడించి పూంగినాటి దేశంబున రాజ్యమను నెలకొల్పి సామ్రాజ్యము విస్తరింపఁ జేయ నెంతేవి ప్రయత్నించి కృతార్ధజన్ముఁడై యాంధ్ర దేశంబునఁ జరకీర్తిని సంపాదించిన నాఁడు. *[1] స్వదేశాభిమాసము, స్వభా షాభిమానము, స్వమతాభిమానము, స్వజనాభిమానముగల భూపాలుర లో నితఁడగ్రగణ్యునిగా భావింపవచ్చును. కనుకనే 'యెర్రా ప్రెగ్గడ వచించిన ట్లనదాత చరితంబున నఖలజనరంజనం బొనర్చుటం జేసి రాజశ బ్ధమునకు భాజనం బయ్యెను. ఇతఁడు స్వబంధుజనాను రాగము మెండు గాగలవాఁడై బహుభూములాక్రమించి యనుజ తనుజ బాంధవ మిత జనుల కిచ్చెనని హరివంశములోని యీకింది పద్యమువలన విస్ప ష్టమగుచున్నది.

తనకు సడ్డంకి తగు రాజధానిగా బ
రాక్రమంబున బహుభూములా క్రమించి
యసుజతసుజు బాంద పమిత్ర జనులకిచ్చి
నెదుగ యెవ్వారు వేమషహీశ్వరునకు

అద్దంకి యతనికి రాజధానిగాముండెననీ కూడఁ బై పద్యమునల

ననే తేటపడుచున్నది. ఇట్లతఁడు భూముల నొసంగి స్వబంధుజనుల

  1. * శ్రీశైల పూర్వతట నికటమునుండి పూర్వసముదము దాక ప్రవహించు సం ఉతరంగణిమను గుండ్లకమ్ము నది కిరుప్రక్కలనుండు సీమకేపూంగి నాడసు నామముగల దని తెలియుచున్నది.