ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

శ్రీనాథ కవి


పడఁగలదు. ఆమైత్రి యెచ్చట నెప్పు డేవిధముగా సంభవించెనని ప్రశ్న యుపుట్టఁగలదు. కొండవీటి సామ్రాజ్యమును బరిపాలించిన కుమారగిరి రెడ్డి పరిపాలన కాలమునఁ గొండవీడులో కుమారగిరి రెడ్డి ప్రతిసంవత్స రము వసంతోత్సవ సందర్భములందు సుగంధవస్తు భాండాగారాధ్యక్ష్యు డైయున్న సమయములందు బాలుఁడైన శ్రీ నాథకవితో యౌవనవయ స్కుఁడయిన అప్పయ సెట్టికి మైత్రి గలిగినని చెప్పవచ్చును. కునూర గిరి రెడ్డి1383 మొదలుకొని 1400 వఱకు ప్రతిసంవత్సరము వసంతోత్సవములను జరుపుచు వసంతభూపాలుడని ప్రఖ్యాతి గాంచినది చరిత్ర ప్రసిద్ధ మైనవిషయుము. ఆకాలమున మన శ్రీనాధకవి బాలుఁడుగా నుండినను, అప్రతిమాన ప్రతిభావంతుడై గవితావిద్య నలవఱచుకొని ప్రఖ్యాతగాంచుచున్న వారచేత వసంతభూపాలుఁడు జరపు వసంతోత్సవములకు శ్రీనాధుఁడు బోవుచుండు వాడగుట చేత నాతనితోఁ దిప్పయ సెట్టికిఁ బరిచయము గలిగి క్రమముగా మైత్రి యేర్పడినదని చెప్పుదగును. కుమారగిరి రెడ్డి మరణకాలమునకుఁ దిప్పయ సెట్టికి 45 సంవత్సరములకు మించిన వయస్సుం డదు. శ్రీనాథమహాకవికీ 20 సంవత్సరములకు మించిన వయస్సుండదు. చిన్నారిపొన్నారి చిఱుత కూకటి నాటినుండి (అనఁగా 14 సంవత్సర ముల ప్రాయముగల కాలము) శ్రీనాధకవి తిప్పయ సెట్టికి మిత్రుఁ డై యుండెను. వసంతోత్సవముల వైభవములు వసంతభూపొలుని మర ణముతోనే నిలిచిపోయినవి. ఏనాఁడు వసంతభూపాలుని కొండవీటి సొ మ్రాజ్యము పెదకోమటి వేమా రెడ్డి యాక్రమించుకొని పరిపాలనను చేయుట సాగించి తనకు పరమమిత్రుఁడైన కుమారగిరి రెడ్డి కుటుంబ మునకు శత్రువయ్యేనో నాటినుండియుఁ దిప్పయ సెట్టికిఁ గొండ వీటితో సంబంధము విడిపోయి కాంచీపురమే సుస్థిరనివాస మయ్యెను. .. పెదకో మటి వేమా రెడ్డి యాస్థానమున శ్రీనాథ మహాకవి విద్యాధి కారిపదవి