ఈ పుట అచ్చుదిద్దబడ్డది

45

శ్రీనాథ కవి


నము 1400 - లకును నడిమికాలము లో సనగా 1400 వ సంవత్సర ప్రాంతమున హరవిలాసము రచింపఁబడెను. అప్పటికీ శ్రీనాథుఁనకు ముప్పదినాలుగు ముప్పది యైదు సంవత్సరముల వయస్సుండును." అని వ్రాయుచు లక్ష్మణరావు గారికిఁ బ్రత్యుత్తరమిచ్చియున్నారు. ఇంతగా వ్రాసిన నీ రేశలింగముగారు సర్వజ్ఞ సింగమ నాయని ప్రశంస వచ్చునప్పు టీకి నదియేమి మహత్మ్యముననో కాని తమతొంటి బుద్ధి కౌశలము నంత జాఱవిడిచి విపరీతాప్రమాణవాదమునకుఁ గడంగుదురు. వీరి వాద వైపరీత్యమును గనుఁడు. సర్వజ్ఞసింగమనాయని గూర్చివ్రాయుచు, 'బేతాళనాయనికి నేడవతరమువాఁడుసర్వజ్ఞసింగమ నాయఁడ గుటకు సందేహము లేదు; రసార్ణ వసుధాక గానీ సంస్కృత గ్రంథము లను రచించినవాడతడే యగుటకును సందేహము లేదు. శ్రీనాథ పోత నార్యులాతని కాలపువారు కాకపోవుటయు సందుచేత నాతని యాస్థాన మునందుండకపోవుటయు నిశ్చయమే. అంతమాత్రముచేత పదవతరము వాఁడైన సింగమనాయడను విద్వాంసుఁడుచు సర్వజబిరుదాంకితుడును గాఁడససిద్ధాంత మేర్పడ నేరదు." * అనివీరేశలింగముగా రేడవతరము సింగమ నాయని కాలములో శ్రీనాధుఁడు లేఁడనుట నిశ్చయముని నొక్కి వక్కాణించు చున్నాడు. 1368 వ సంవత్సరమునఁ బుట్టి ముప్పదై దేండ్ల ప్రాయ సనఁగ 1400 సంవత్సర ప్రాంతమున డెబ్బదేండ్ల ప్రాయముగల తిప్ప య శెట్టికి హరవిలాసమంకింతము చేసెనని యొక ప్రక్కను సిద్ధాంతము సేయుచు నేఁడవతరము సింగమనాయని కాలములో శ్రీనాధుఁడు లేఁడని నొక్కి వక్కాణించుట పరిహాసాస్పదమైన విపరీత సిద్ధాంతమనుటకు లేశమాత్రమును సంశయింపఁబని లేదు. ఆఱవతరమువాఁడైన అనపోత నాయడు 1381 వఱకును బ్రతికి యుండి పరిపాలనము చేయుచున్నట్టు శాససములు ఘోషించుచుండగా వాని తరువాతవాని కుమారుఁడేఁడవ తరము సింగమనాయడు పరిపాలనము చేసిన ట్లాసింగమనాయని