ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

శ్రీనాథకవి

యని యడుగుట? ఇంకొక చిత్రము చూడుఁడు. ఈ తెలుంగురాయని చాటుపద్యమును నిలువఁ బెట్టుటకై యెన్నో తికమకలు పడినట్లు గన్పట్టు చున్నది తెలఁగురాయని కొడుకు తిరుమల రాయలు క్రీ.శ 1470 సంవత్సరములలో నూతులపాడున సెలకొల్పిన శాసనమును జతుర్థ ప్రకరణమున బేర్కొనుచు నాతఁడు శ్రీ శ .1470 లో జన్మించెననీయు, అతఁడు పుట్టి వెనుకనే తెలుఁగురాముఁడు మరణించే ననియు, అతని మరణ కాలమునకును శ్రీనాథుని మురణ కాలమునకు నడుమ నాలుగై దేండ్లకంటె నెక్కువ వ్యత్యాస ముండఁజాలదనియు మొదటి ప్రకరణను. లోవక్కాణించుచున్నారు. ఎంత యాభాపసిద్ధాంతము? తెలుగు రాయని యాశ్రయమంత కాలము శ్రీనాథునికున్న యెడల బొడ్డుపల్లెను గొడ్డేలి మోసపోయి యెడ్డ ప్రభువుల చే నేలడ గండ్లు పొందవలసి వచ్చెము? ఇది యంతయు నేలవిచి చేయు పామువలె నున్నది.

శ్రీనాథునకు తెలుగురాయని యాశ్రయ మేకాలమున లభిం చి యుండవలయునో తమకు దామైనను స్థిరపరచుకొని యుండ లేదు.భీముఖండకృతిభర్తయగు నన్న మంత్రి దక్షవాటిక యందుఁ దరుణేందుమౌళికి మొగలివాకిట ధామముమును రచించి కీ.శ.1428.లోశాసనము వ్రాయించిన ధర్మ కార్యము భీముఖండమునఁ బ్రశంసింపబడియుండుటచే భీమఖండ రచనము క్రీ.శ.1428 కి దరువాత నే జరిగెనను విషయము నిశ్చలమైన సిద్ధాంతమనియు భీమ ఖండరచనమునకు దఱువాతనే శ్రీనాథునకు దాక్షరాను రామా సమాయోగము కల్గినదని చెప్పెడు శాస్త్రీగారంతకుఁ బూర్వమే తెలుఁగురాయని యాశ్రమము మనకవి వరేణ్యునకు లభించినదనియు నప్పుడే పై కస్తూరికా బిక్షాదానము చేయు రా, యను చాటుపద్యము చెప్పి యుండునని తలంచుటకునై నను సాధ్యపడదుగదా! సింహాచల శాసనములో కన్న en