ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాధ్యాయము

271


పోకిరితన మచ్చుపడ వక్షోజ సంభి కుంభములపై బ్రాముటగని దెల్పురా ! పోకిరితనమున గడి తేఱిన దుండగీడు సయితము నట్లడుగుటకు వెఱచునే ఇంతకును శ్రీనాథునకు తెలుగు రాయని యాశ్రయమెప్పు డేర్పడినది యనునది సిద్ధాంతమైన, ప్రభాకరశాస్త్రీగారు భీంమఖండ రచనము తరువాత ద్ద్రాక్షారామరామాసరూ యోగము కల్గిన యాపము క్రీ.శ. 1435- 1440 ప్రాంతమున "తెలుంగురాయని యాశ్రమము మేర్పడినదని వ్రాయుచున్నారు, ఆ కాలమునరాజమహేంద్రపురాధీశ్వరులగు నల్లాన వేమారెడ్డి వీరభద్రారెడ్ల యాశ్రయమున నున్నవాడు కాని తెలుంగు రాయని . యశ్రమమున లేడని స్పష్టముగాఁ జెప్పవచ్చును. భీముఖడ రచనము తరువాతనే యోగము శ్రీనాథుకు లభించినట్లుగా వ్రాయుచున్నారు. కనుక రాజమహేంద్ర పురమున 'రెడ్లరాజ్యము నశించిన వెనుకనే తెలురాయని యాశ్రమము మేర్పడి యుండ వలయును. ప్రభాకరశాస్త్రి గారి సిద్ధాకము ప్రకారము 1440 సంవత్సరము నాటికి శ్రీనాథునకు నేబదియైదు సంవత్సరముల వనుస్సుండును. నాయభిప్రాయం ప్రకారము ఆరువది యేండ్ల వయస్సు వార్దకము గాని ప్రౌడనిర్భర వయఃపరిపాక కాలము గాదని శాస్త్రి గారు స్పష్టముగా వక్కాణించినారు. చిన్నారి పొన్నారి చికుతకూకటి నాడు కాదే నూనూగు మీసాల నూత్న యవనము గాదె, ప్రాయమింతకుఁ గై వ్రాలకుండుననీ చె ప్పుకొన్న కాలుముగాదే! వార్ధకము వైఁబడి గడచుచున్న కాలమే! అష్ట కష్టములం బడుచున్న కాలమే! ఇట్టి కాలమున నాద్రాక్షారామాచళుక్య భీమవరగంధ రాప్సరో భామినీవక్షోజవ్వయ కుంభి సంభము లపై శ్రీనాథకవి సార్వభౌముఁడు తద్వాసనల వాసింపఁ జేయుటకై తెలుంగురాయని యాశ్రయించి కస్తూరి గాబి దానము చేయురా