ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాధ్యాము

269


ఆ నేక విషయ విజ్ఞానములు గలట్టియు, (పాండిత్యములు,) ద్రాక్షారామ చళుక్య భీమవరములలో నివసింపుచు పాటల యందును, ఆటల యందును నేర్పు గలిగి యున్న వేశ్యా స్త్రీ యొక్క చనుఁగవల యందలి మంచి గంధము, కుంకుమపువ్వు రెండు రాజ్యములయొక్క బరువును బరిపాలించు నని శబ్దార్దము స్ఫురించుచున్నది గాని భావము విస్పష్టముగ స్ఫురింప నందున నీ కాలము నందలి సాహితీ మండితులయిన పండితులకి పభ్రమలు కలుగుటకుఁ గారణముగు చున్నది. ఈ పద్యము యొక్క ... భావమును దెలిసికొనవ లెనన్న నాకాలము నాటి దర్బాల తీరులెట్టివో ఆచారములను, నడవళ్లలోను నేవిదూష్యములో, ఏవిదూష్యములు గావూ, కవిసాంప్రదాయము లెట్టివో కవుల పోకడ లెట్టివో దేవ దాసీ ప్రతిష్టాపన మెట్టిదో స్థాపన మెట్టిదో వీని నెల్లనవ గాహనము జేసికొన్న మీదట సాధ్యపడును గాని స్థూలదృష్టితోఁజూచు నీ కాలపు వారికంతగా బోధ పడదు. కవి హృదయమును గ్రహించిననఁ గాని వ్యాఖ్య లపహాస్య భాజనములగును.


ఎట్లు రాజసభలయందు వేశ్యాస్త్రీల యొక్క వక్షోజద్వ యములందలి గంధ సారఘు స్వణముల యొక్క సౌరభములు సభోంతరాళమున నల్గడల బర్వి సభ్యుల నానందపరవశుల గావించునో యట్లే వాని నతిశయించి కవిసార్వభౌముని ప్రౌడ సాహిత్యములు గూడ సభ్యుల నానందవరవశులఁ జేయునని భావమెగాని యంతకన్న విపరీత భావ మేమియు లేదు, ఇట్లు ప్రొఢముగా ప్రభువుల నభలలో వక్కాణించుట యాకాలమున గౌరవలోపముగా భావింపఁబడకుండుట చేతనే శ్రీనాథ కవిసార్వభౌమడు తన్ను గూర్చి వలికినట్లు ప్రభువు నోటఁ బలికించినాడు.

'కాశీఖండము లోని పర్యమను గాంచి యపభ్రమల పాలయి యౌచిత్య మెఱుంగని కవియెవ్వడో యొక యనామకుండు శ్రీనాథకవి