ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాధ్యాయము

267

అక్షయ్యంబగు సొంప రాయని తెలంగాదీశ కస్తూరికా,
బిక్షాదానము చేయు రాసుకవి రాడ్బృందారకా శ్రేణికిన్
దాక్షారామ పురీవిహార పర గంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వ్య కుంభి కుంభముల పై నాసించుఁదద్వాసల్ ,


ఈ పాఠమునకు భిన్నముగా శాస్త్రులవారుదహరించిన పాఠములో శ్రేణికిన్' అను పద్యమునకుఁ బక్కను స్వామికిస్ ! అను కుండ లీకరణమున నుంచబడింది. 'పురీవిహారవర' యను దానికి బదు లుగా చళుక్య భీమవర' యని చేర్పఁబడియున్నది.


ఇయ్యది శ్రీనాథునిదనుట కేమి నిదర్శనమని యడుగుదు మేని ప్రభాకరశాస్త్రి గారిట్టి పద్య మొకటి క్ష ప్రాసముతో కాశీఖండమున నున్నడని మాత్రము చెప్పవత్తురు. ఆపద్యమును గూడ నేనిదివఱకే పంచ అధ్యాయమున నుదహరించి యున్నాను. ఆపద్యము కాశీఖండ ములో నిట్లున్నది.

శా. ఈ క్షోణిన్ని నుఁబోలు సక్కవులేరీ నేటి కాలంబునన్ ,,:
దాక్షారామ చళుక్య భీమువరగంధర్వా స్సురోభామినీ
వక్షోజద్వయ గంధసారతార ఘునృణ ద్వైరాజ్యభారంబున
ధ్యక్షించున్ గవిసార్వభౌమ భవదీయ ప్రౌఢ సాహిత్యముల్ ,

,

రెండునుశార్దూలవృత్తములు, రెటియందును శ' ప్రాసముండుట, వంటియు విశేషించి . దాక్షారామ చళుక్య భీమపర గంధర్వా వ్సరో భామినీ వక్షోజద్వయ” ఆను నంతనఱకు రెంటియందు సుండుట. ఈ కారణముల చేత చాటువద్యముకూడ శ్రీనాథునిదని శాస్త్రిగారి విశ్వాసము.

స్థూలవిముర్శదృష్టితోఁ జూచినప్పు డీ రెండు పద్యములను రచించి నవాడు శ్రీనాథుఁడే నని యనుమానించుట కవకాశము గలదు గాని సూక్ష్మ విమర్శ దృష్టితోఁ జూచినప్పుడు మాత్రము పై చాటు