ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాధ్యాయము

265


పలువురు చదువరానివియు, వినరానివియునై చితికి పోయిన ప్రాత తాటాకులలో న బూజు కట్టి మాలిన్యగ్రస్తములై దిక్కు మక్కు లేక యణగి మణగి పడియున్న శృగాకధారలనెల్ల బహు ప్రయాస ముతో సేకరించి పరిశోధించి శ్రీనాథుని తలకు బ్రామి శృంగార ప్రవర్త మము' గూర్చి వ్రాసిన ప్రకరణమును గూడ మూలనుంచక యందుఁ జేర్చిముద్రించుటుకు సాహసించి యున్న యెడ వీరి శృంగార శ్రీనాథము' నేతిబీరకాయ వంటిది గాక సార్థకనామము వహించినదగునుగదా ఎంత వెర్రి పని చేసిరి? శ్రీనాథుని శృంగార ప్రవర్తనము నిరూపించుట కయి కొంత గ్రంధము వివరించి వ్రాయ మన సొల్లకున్న దని వ్రాయుచు నా దిగువనే యందు కొఱకు నొక పెద్ద ప్రకరణమును రచించియు నది పదుగురును జదువదగినది కాదను కారణమున దూరీ కరించితి మనిరి. వ్రాయ మనసొల్లని దానిని తిరిగి వ్రాయుటకు మన సెట్లోల్ల గలిగిందో నునసొల్ల గలిగి వ్రాసి దానిని ముద్రించుటకు మరలమనసెట్లోల్ల నీయక దూరీకరింప జేసినదో శృంగారరసానంద మున నోలలాడు నట్టి ప్రవృత్త చిత్తము గల శృంగార శ్రీ నాథ" కర్తలకే తెలియవలయుఁ గాని నావంటి యరసికున కెంత మాత్రము బోధపడఁ జాలకున్నది

శ్రీనాథుని శృంగారి యన్నను, శృంగారప్రియుఁడన్నను, శృంగార శేఖరుఁడన్నను, నాకు చింత లేదు. వారితో వివాదమును లేదు.శ్రీనాధుని భోగ పరాయణుఁడన్నను మహాభోగ పరాయణుఁడన్నను నేనంతగా విచారపడువాడను గాను.

శ్రీనాథుఁడు దాక్షారామాప్సరోరా రాయల యొడళ్లవయి కస్తూరి బుగ బుగ లొల్పు వాఁడని యొక వంకనుఁ వైషయిక వర్తనముననగ్రకోటి సధిష్ఠించియు మ్రొగ్గఁతిలఁబడక చిరజీవితము సాగించు కొన్న వాఁడని మఱియొక వంకను జాటుచు బయి విశేషణముల