ఈ పుట అచ్చుదిద్దబడ్డది

256

శ్రీనాథకవి


మును బోఁగొట్టుకొన్న పాపఫలముతక్క వేటొక్కటి గానరాదు ,,

అనియొక యపూర్వ వ్యాఖ్యానము చేసి ధర్మోపదేశమగావించి యున్నారు.

ఈ చాటుపద్యములు రెండును శ్రీనాథకవియే మనము విశ్వసించిన యెడల మొదటి పద్యము చెప్పిన కాలమునకును రెండవ పద్యము చెప్పిన కాలమునకును నడుమ గొంత కాలము గడచిఁ యుండ వలయును. ఏకకాలమనఁ జెప్పినవి కావనుట సత్యము.

శ్రీనాథుఁడు కీ శ. 1360 లోఁ బుట్టి శ్రీశ. 1440 లో మృతినొందెననియు నప్పటికీ 80 సంవత్సరముల వయస్సుగలవాఁడైయుండునని లక్ష్మణ రావు గారును, (1365 లో బుట్టి 1440- 45 లో 84 సంవత్సర ప్రాంతముల మరణముఁ జెందెనని, వీరేశలింగము పం తులుగారును. సిద్ధాంతములు చేసి యున్నారుగదా! అనఁగా శ్రీనాథురకు 60 సంవళ్ళగము » వచ్చు వఱకును వీరభద్రా రెడ్డి బ్రదికి యున్న వాడు గావున సంతవఱ కిట్టి నష్టము శ్రీనాథునకు సంభవింప లేదనియు నటు పిమ్మటనే యీతఁడిట్టి కష్టములను బొందెననియు, దేటపడుచున్నది. పంతుల వారీ యభిప్రాయము ననుసరించి యెనుబది యేండ్లు దాటిన ముసలితొక్కు ఒక గ్రామమును గుత్త కుఁ గొనుటయుఁ వ్యవసాయము చేయుటయు వఱదలు వచ్చి పంటల గొనిపోవుటయు ఏడునూర్లటం కంబులు పన్ను చెల్లింప లేక పోవుటయు, ఎండలో నిలువఁ బెట్టబడుటయు బొండవేయుటయు, నగరి వాకిట నుంము సల్లగుండు భుజముపైఁ బెట్టు టయు సంభవించెనన్న విశ్వసింపఁదగునా ? కాటికి గాళ్ళు చాచుకొని యొక మూల ప్రాణములను విడుచుచు నాకు రత్నాంబరములు కావ లెననియు, కస్తూరి కావలెననియు, హేమపాత్రాన్నము కావలెనవియు, దినవెచ్చము గావలెననియు, శ్రీనాథునివంటి వేదాంతియుభక్తాగ్రేసరుఁడును నేడ్చెనన్న విశ్వసి పవచ్చునా? స్త్రీలోలుడై వయః