ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాధ్యాయము

247


మిక్కిలి సమర్దుడు, విక్రమాడ్యుఁడు నగుట చేతఁ దన రాజ్యమును విస్తరింపఁ జేయ సంకల్పించెను. రెడ్డి రాజ్యము నాపోవనముఁబట్టిన గాని తన సంకల్పము నెఱవేఱజాలదని తలంచెను. అందులకై పది సంవత్సరములు కృషి చేసెను 1444 వ సవత్సరముఁ గపిలేంద్ర గజపతి రాజమ హేంద్రపురముపై దండయాఎత్ర వెడలివచ్చెరు. ప్రౌఢ దేవ రాయలు రెడ్లకు సొయ్యము జేయవచ్చెను. ఉభయపక్షముల వారికి యుద్ధములు జరిగినవి. కపిలేంద్ర గజపతి యుద్ధమున గెలువఁ యాతడవకు మరలి పోయెను గాని తన పట్టువిడిచిన వాడు గాఁడు. ప్రౌఢ దేవరాయ లాసంవత్సరమున దక్షారామ భీమేశ్వరుని సందర్శించి యొక దాన శాసనమును వ్రాయించి వెడలిపోయెను తరువాత రెండు సంవత్సర ములకు విద్యానగరమునం ప్రతాప దేవ రాయలు మరణయుఁ బొందిసందునగజపతికి బలమెక్కువ యయ్యెను మహా సమర్దుడైన తన శత్రువుకఁడు మరణము నొందినందున గజపతి కర్ణాట సామ్రాజ్యమును స్వాధీన పఱచుకొని పిమ్మట తురుష్కులను జయించి దక్షిణ హిందూదేశమున నేక సామూజ్యమును స్థాపింపవల యునని సంకల్పించి క్రీ శ 1447బ్ వ సంవత్సరమున విజృంభించి యసంఖ్యాకములగు సైన్యములతో దండయాత్ర, బయలు దేఱి రెడ్డి రాజులను జయించి రాజమహేంద్రపు రాజ్యమును మాత్రమేగాకదక్షిణమున నుదయగిరి వఱఁగల కర్ణాట రాజ్యమును, ఏకశుకానగరము వఱకుగల పద్మ వెలమ నాయకుల రాజ్యమును నాక్రమించుకొని యారాజ్యముల బరిపాలించుటకైప్రతినిధి పాలకుల నియమించెను. పరశురామరఘునాధ రాజు, వీరభధ్ర రాజు, కంబము మెట్ట, ఓరుగిల్లుసీమలఁ బాలించుటకు నియమింపఁబడిరి.గజపతిపాత్ర సామంతులలో నొకడు రాజమహేంద్ర పుర రాజ్యమును బరిపాలింపుచుండెను.కొండవీటి రాజ్యమును