ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాధ్యాయము

241

  సీ. త్య్రంబకాచల కన్య కాంబు పూరంబున
సఘమర్షణ ప్నా వమాచరించు
నిద్దమైన మడుగు నీర్కాని దోపతి
కవక మేఖలతోడి గడి ఘటించి
మూలమంత్రాక్షరంబుల బూతి మంత్రించి
పుండ్రకంబుగ ఫాలమున ధరించి
క్రొత్త ముత్యములతో రుదాక్షమాలిక
లష్టోత్తర శతంబు లఱుత దాల్చి

గీ, పుండరీకాననన మన గూర్చుండి శంభు
నర్చరము చేయునప్పుడు మహాప్రమధుడు
చాలనొప్పొరు రెండవ శంభునట్లు:
వీర నాయణుఁడు రెడ్డి వేమవిభుఁడు..
సీ. గోదావరీ పాపనోదకంబుల హేమ
కలళశతంబుల జలక మార్చు
గర్పూరకస్తూరికా కుంకుమంబుల
గలవంబుఁగూర్చి శ్రీగంధమందు
సప్త గోదావరీ స్స్వర్ణపుష్కర హేమ
సౌగంధికముల నర్చన మొనర్చు.
గలధాత పాత్రల గా లాగరు చ్ఛేద
బహుధూపంబులు పరిఢవించు

గీ. వేనవేలునివాళుల విస్తరించు
నమృత దివ్యాన్నముల నుపహారమిచ్చు
సంఘటించు సశేషోపచారములను
బొమధ నాయకునకువీరభద్రనృపతి,

వీరలు శైవమతావలంబకులయినను ఫరమతములమ సయితము, సహన భావముతోఁ జూచుచుండిరి కాని యెన్నఁడును ద్వేషబుద్దితో జూచి నట్లు గన్పట్టదు.