ఈ పుట అచ్చుదిద్దబడ్డది

234

శ్రీనాథకవి


భాగవతరచన ననుకరించి యొక చిన్న దండకము చెప్పుట పండితకవు లకు నసాధ్యమగునది కాదు. ధనలోభముచే నిట్టి రచనగావించు కవులు పెక్కండ్రు కలరు, భోగవతములోని దూషణకు సిగభూపాలుఁడు కారకుడు కాడని భావికాలము వారనుకోనుటకై యాతనికి సర్వజ్ఞ బిరుదము గల్పించి యాతఁడుంచుకొన్న లంజ తొత్తుపై పోతన చెప్పి నట్లుగా భాగవతరచన ననుకరించి యూదండకమును వ్రాయించి చివర పండిత కీర్తనీయుఁడగు బమ్మెర పోతన రచించినాఁడను పద్యమును జేర్చినారు, ఈ సింగభూపాలుఁడు సర్వజ్ఞుఁడనుట కాధారము వేఱు గానరాదు.

ఈ సింగభూపాలుఁడు రచించిన గ్రంథములుగాని, అంకితము బొందిన కృతులుగాని, గాన రావు. ఇతని యాస్థానకవులు గాని పండి. తులుగాని గానరారు. సిగభూపాలీయు' మను గ్రంథము చమత్కా రచంద్రికకు నామాంతరముగాఁ గన్పట్టుచున్నది. ఆయ్యది విశ్వేశ్వర పండితకృతము. ఇతఁడు పెదకోమటి వేమా రెడ్డికి సమకాలికుఁడు గాఁడు, విశ్వేశ్వర పండితుఁ డీతనికి సమ కాలికుఁడు గాఁడు రేచర్ల వంశ మువారిలో నొక సింగమనాయఁడు సర్వజ్ఞ'బిరుదముతోనొప్పిన వాడు గలఁడని లోక ప్రతీతి మాత్రము గలదు కాని గ్రంథస్థమగు ప్రమాణము. గాన రాదు. భోగినీదండక మా కాలమునఁ బుట్టినది కాదని యిదివఱకే తెలిపియున్నాను. 'షెదకోమటి వేమారెడ్డి (సర్వజ్ఞ చక్రవర్తి' బిరుదము వహించుటకు గారణము రేచర్ల వంశము నాకాలమునఁ గాని యంతకుఁ బూర్వమునఁ గాని సర్వజ్ఞ బిరుదము గలవారుండుటయే. అదియొక న్యూనతగా నుండు నేమో యని యా బిరుదముతో వ్యవహరింప బఁడిన వారు గాని తదాస్థాన పండితులు గానీ కవులు గాని యా బిరుదమును గంథస్థము చేసి యుండలేదని నా యూహ. ఈరహస్యమును దెలుప