ఈ పుట అచ్చుదిద్దబడ్డది

232

శ్రీ నాథ కవి


మఱియొకటి యుండబోదు. ఇంతటి యాత్మ గౌరవసంపత్తిగల యీకవి చంద్రుఁడు సింగమనాయఁడుంచుకొన్న వేశ్యను గూర్చి దండకము చెప్పెనని కానీ, చెప్పునని కాని, యూహించుటకే సాధ్యపడదు. ఇతని కివి సింగమనాయచికి సరిపడదని యంకితమును గూర్చిన కథయె వేనోళ్ళఁజాటుచున్నది. ఒక వేళ భాగవతము రచించుటకు ముందే భోగినీ నండకమును రచించి యుండునని యూహింతమన్నను భాగవత ములోని రాజదూషణ మీయూహము గూడబాధింపకమానదు. అది వఱకు సింగమనాయని యాస్థానకవిగ నుండి భోగినీ దండకమును జెప్పిన కవి యొక్క మూఱుగా రాజు దూషణునకుఁ గడంగుట తటస్థింపదు. ఇష్టము లేనియెడల నరాంకితము చేయకుండునే గాని యాతని రాజ్యము నందుండి యారీతిగా రాజదూషణము గాపించి బతుకఁ జాలునా? ఈ భోగినీ దండకము చివరను, -


 ఉ. పండికీర్తి నీయుఁడగు బమ్మెర పోతన యాసుదాంసు మా
ర్థాండ చలా చలాంబునిధి ధారళమైమై విలసిల్ల భోగినీ
దండకమున్ రచించె బహుదానవిహర్తకురావుసింగ భూ
మండల భర్తకున్ వినుతమానవ నాథ దాపహర్తకున్,


అనుపద్యము గన్పట్టుచున్నది. ఇది బమ్మెరపోతన చెప్పిన పద్య ంబుగాఁ గన్పడదు. "పండిత కీర్తనీయుఁడనని బమ్మెరపోతన పై దండక మువంటి చిన్న వ్రాతకుఁగా నింత బిరుదాంకితము వేసికొని యింతగా నాత్మస్తుతి చేసికొనునో?' అని కవిజీవిత గ్రంథ కారులగు గుర జాడ శ్రీరామమూర్తిగా రిదివఱకే ప్రశ్నించి యున్నారు. "పండిత కీర్తినీయుఁగు బమ్మెర పోతన" అని " యుండుటచేతనే యీపద్యము మఱియొకరు వ్రాసినట్లు స్పష్టముగుచున్నది. ఈ భోగినీ దండకముగూడ బమ్మెరపోతనకృతము గాదనినాదృఢ మైనయభి ప్రాయము, భాగవతము రచింషఁపడిన బహుకాల మనకుఁ బిమ్మట సింగమనాయడు గాని బమ్మెర పోతనఁగాని యెఱుగనే యెఱుగరు. -కీర్తికాముఁ డగుటచేత