ఈ పుట అచ్చుదిద్దబడ్డది

220

శ్రీ నా ధ కవి


ఈ పయి వంశవృక్షములో 2 న తరమువాఁడై న సింగమనాయఁడే రసార్ణ పసుధాకర గ్రంధకర్త యనియు, ఇక్కడే మొదటి సర్వజ్ఞ సింగభూపతి యనియు, ఈసింగమనాయుని నాలుగవ కుమారుఁ డగు "వేదగిరిస్వామికి మనుముడగు సింగ భూపతి గూడ సర్వజ్ఞ బగుదము గల దనియు ఇత:- మంచుకన్న వేశ్యమీదనే బమ్మెరపోతన భోగినీ దండకము రచించిన వానియు, ఈ సర్వజ్ఞ సింగబూపునేపునే శ్రీనాథ కవిసార్వభౌముఁడు సంద ర్శించెననియుసివెలుగోటి సారి వంశచరిత్ర గ్రంథకర్తలు వ్రాసియున్నారు. ఇంతకు పూర్వము వారివాదనను ఖండించి యున్నాను.శ్రీ ప్రభాకర శాస్త్రీ గారీవిషయమునే తమ గ్రంథమునఁ జర్చించుచువీరి వాసము కు ఖండించుచు మఱియొక మార్గమును దొక్కి.. యేడవతరమువాడను, రసార్ణవసుధాకర గ్రంథకర్త యునగు సింగభూపాలున్ని పెద్ద కొడుకగు అనపోతనాయఁడే భోగినీ దండకమున వక్కాణింపఁ బడిన కుమారాస్నపో తానాయఁడనియు, అతనికుమారుఁడేసర్వజ్ఞ సింగభూపతి యనియు వక్కాణించి లోక ప్రతీతిగన్న యాభాసకథను నెట్లయిననిలువఁ బెట్ట బయత్నించుచున్నారు. ప్రభాకరశాస్త్రి గారు తమగ్రంథములోఁ ప్రదామ ప్రకరణఘున 14 వ పేజీలో రేచర్ల వారి వంశ చరిత్రసర్వజ్ఞ సింగభూపాలుడు సరిగా గుర్తింప నగుచున్నాఁడని వ్రాసియుండి షష్టప్రకరణములో " ఈసింగ భూపతికి సర్వజ్ఞ బిరుదము గానరాదు; రసాయనసుధాకరమున లేదు; చమత్కార చంద్రికలో లేదు; అమర వ్యాఖ్యలో లేకు; పాతవాతలలో నెక్కడను లేదు; కాని వెలు గోటివారి వంశచరితమున నీతఁడు మొదటి సర్వజ్ఞ భూపతిగాను, శ్రీనా ధునిచే దర్శింపఁబడిన వాడు రెండవ సర్వజ్ఞ సింగభూపతిగాను వ్రాయఁ, బడినది; అవ్రాత యసంగతము. " అని వ్రాయుట విపరీత విషయము.

ప్రభాకర శాస్త్రిగారు సర్వజ్ఞ సింగభూపుని - నెట్లు గుర్తించిరో యవిధ మీక్రింద వివరింతును. పదవ తరము వాడైన సింగమనాయని