ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాధ్యాయము

15


" శ్లో. ఆహితతమః కృశాను ర్వేదుచు భూపాలసూను ?
స్తుతక లికత మహిశా న్నాన్నపోత క్షితీశ
శాకాబ్దేగగ నాష్ట్ర నూర్య గణితేతీ రేమహాంబో నిధి :
ప్రఖ్యాతమ్ము కళాహ్వయే పువరేశ్రీసోమ మంత్రీశ్వరః

ఆందు చేత కాల్పట్టణము మోటుపల్లి గాక వేఱొక సముద్ర తీర గ్రాముమై యుండును. అది యేదియో నిర్ధారణమగు వఱకును క్రాల నఁ గొత్త యని యర్ధము చేయవచ్చును. గనుకను, కడను పట్టణ శబ్దము న్నది గనుకను, కొత్త పట్టణమునుగా భావింతము. కమలనాభుఁడికా ల్పట్టణమునకుఁ గరణము. 'విచమత్కాకతిసార్వభౌము' నని పద్యము లో నుండుట చేత నితఁడు బాల్యములో 1320 సంవత్సరమునయందు కాకతి ప్రతాపరుద్రమహా రాజు కాలములో నుండి యాతనిచే సమ్మానిం పఁబడి యున్న వాఁడనుటకు సందేహము లేదు.

ఆంధ్రకవుల చరిత్రము రచియింపఁబడి ముప్పది సంవత్సరములు దాటిపోయినను, అనేక జన్మాంతరములను గాంచి నూత్న వేషములను దాల్చుచు వచ్చినను, మొన్నటివఱకు కాల్పట్టణము క్రొల్పట్టణముగా మార్పుఁజెంది యుండ లేదు. భీమేశ్వర పురాణముయొక్క ముద్రిత ప్రతి లో నేమి, అముద్రిత ప్రతులలో నేమి, శ్రీరామమూర్తి గారి కవిజీవిత ము'లలో నేమి, 'కాల్పట్టణమనియే. యున్నదిగానీ కొల్పట్టణమని యుం డ లేదు. ఆంధ్రకవిచరిత్రకారు లిట్టిమార్పు నాక స్మికముగాఁ జేయుటకుఁ గల కారణము మన కిప్పుకు స్పష్టముగాఁ బోధపడగలదు. కాల్పట్టణ ముకై పూర్వ సముద్రతీరము నన్వేషించునపుడు వీరికి కొత్త పట్టణము మనస్సునకు స్ఫురించి యుండును. అంతల బొంతలమాఱిగంత దొరకనది గదా యను సంతోషముతో నొక్కగంతు గంతుకొని కాల్పట్టణమును కొల్పట్టణమునుగాఁ జేసి యొక నిమిష కాలములోఁ జిర కాలము నుండి యున్న పాఠముసు గారణము చెప్పకయే యూడ్చి పెట్టి పాఠాంతరభేద మును గల్పించిరి. ఆంధ్ర ప్రపంచమునకు మార్గదర్శకులు గావున నా రెట్టి •