ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమోధ్యాయము

201


అనుపద్య ముదాహరింపఁ బకుటయెట్లు. అట్లొక వేళ యుండిన తరువాత నెవ్వరివలననో యందు చేర్చఁబకి యుండునుగాని గ్రంథకర్త చేర్చినవాఁడని చెప్పవలను లేదు. ఇంతకును. శ్రీధరక ఛందస్సు నంకితము పొందిన సోమభూపాలుఁ డే సోమభూపాలుఁడో రాఘవాచార్యులు గారు సరిగాఁ బరిశోదింప లేడనుకోనియెదను. ఇట్లు వ్రాసినందుకు రాఘవాచార్యులుగారు నన్ను క్షమింతురు గాక!

ఈ వీఠిక భాగమును విడిచి పెట్టిన యెడల శ్రీయాచార్యుల వారి వ్యాసము సర్వవిధముల యోగ్యమయినదిగా నున్నదనుటకు సందియ ము లేదు. ప్రతిపక్షుల వాదము మరల తలయెత్త కుండ జేయఁగలిగిరి. నావంటి విమర్శకునకును గ్రంథ పరిశోధన పరిశ్రమ బాధలు లేకుండఁ జేసి నందులకు వారి కనేక కృతజ్ఞ తాభివందనములను మనః పూర్వకముగా సమర్పించుచున్నాను. వినుకొండ వల్లభరాయఁడు:--

అశ్వలాయన శాఖయందు ఋగ్పేదంబు
కరతలాచులకంబుగాఁ బటించెం
బత్యక్ష మొనరించి థైరవస్వామిచే
సిద్ధసారస్వత శ్రీవరించె

అని వర్ణింపఁబడియుండియు, గవిసార్వభౌముని చేతిలో వెఱివెంగలయ్య యయిపోయినాఁడు.'తా నీగ్రంథకర్తృత్వమును గోరక గ్రంథము నంకితము బొందియుండినయెడల నాంధ్ర ప్రపంచమున నెంతో గౌరవము నొంది యుండును. "కవీంద్ర కాంక్షిత దశమహీరుహము' కావునవల్లభరాయఁడు యశము న విశేషధనమునొసంగి గ్రంథకర్తుృత్వము దనపైబెట్టిం చికొనసాహసించి యుండ నోపు. వల్లభరాయఁడు యశోలోభమున లోకమున నవ్వుల పొలగుచున్నాఁడు. ఎంతవిద్యాధికుఁ డయినను నెట్టి ప్రతిభాశాలి యైనను క్రీడాభి 26