ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాధ్యాయము

197


పూర్వజన్మమున నిట్టిదని భావిజన్మమున నిట్లు పుట్టునని భూత ధివిష్య త్కాలముల జన్మములును జాతులును జెప్పుట సంభనము కాదు, ఈ దేశము లసన్నీటిని దిమ్మతిరిగి దేశముల యొక్కయుఁ బ్రజ ల యొక్కయు రీతుల నెరిగినవాడు శ్రీనాథకవివర్యుఁడు గాని వల్లభామాత్యుడు గాడని మన మెఱుంగుదుము. కనుక శ్రీనాథుఁడే క్రీడాభి రామమును రచించియు డవచ్చును.

క్రీడా కామకర్తృత్వ విమర్శనము.


ఈ పైరీతిని కీ డాభి రామమును గూర్చి 1918 సంవత్సరమున నేను బ్రకటించిన శ్రీనాథకవి జీవితము యొక్క ప్రథమముద్రణగ్రంథమున వ్రాసి ప్రకటించిన తరువాత ప్రభాకరశాస్త్రి గారు నా యభిప్రాయము బలపఱచుచు మఱికొన్ని దృష్టాంతములను జూపుచు1923 సంవత్సరమునఁ దాము ప్రకటించిన శృంగార శ్రీనాథ' మను గ్రంథమున నీ వాదమును గొంత విపులము గావించిరి. అందుపై నినా మిత్రులగు వేమూరీ విశ్వనాథశర్మగారు క్రీడాభిరామ గ్రంథకర్తశ్రీనాథుఁడు' యను శీర్షికతో ప్రభాకరశాస్త్రిగారు చూపిన హేతువులను ఖండించుచు 'దమ , యుక్తులచే క్రీడాభిరామ గ్రంథకర్త వల్లభరా యఁడే గాని శ్రీనాథుఁడు. కాఁడను వీరేశలింగముగారి వాదమునునిలువఁ బెట్టవలయు నని చేతనై నంతవఱకుఁ బ్రయత్నించి సమర్థింపఁబూనిన నొక వ్యాసమును భారతీపత్రిక యందుఁ బ్రకటించిరి. అటుపిమ్మట శర్మగారి వాదమును సంపూర్ణము ముగా ఖండించుచు క్రీడాభిరామ కర్తృత్వ విమర్శన' మను శీర్షిక పేరుతో దీర్ఘ పరిశోధ నముతో గూడిన యొక పెద్ద వ్యాసమును రాఘవాచార్యులుగా రాభారతీపతిక యం దే క్రీడాభిరామ గ్రంథకర్త వల్లభరాయుఁడు గాక శ్రీనాథుఁడే యై యుండవలయు సని. శర్మ గారికిఁ బ్రత్యుత్తరము . ప్రాసి