ఈ పుట అచ్చుదిద్దబడ్డది

169

శ్రీనాథకవి


కాలమును నిందించినారు. ఈకడపటి యభిప్రాయమునే శ్రీవీరేశలింగము గారు పలుతడవులు వక్కాణించి యున్నారు. గావున నంచునగూర్చి ప్రత్యేకముగా మఱి యొక స్థానమునఁ జుర్చేంపబూని యిచ్చట విరమించు చున్నాము. కాలముకు మాత్రము నిందించెనే కాని కవిని మాత్రము శ్రీనాథుఁడు కాడనుకొనుటచేత జారుడనికాని పాపుఁడనికాని నిందిం పక విడిచి పెట్టినారు. ఒక వేళ అభాగ్యో పాఖ్యానము, ప్రహసనములు మొదలగునవి వ్రాసిన తామాకవిని నిందించినపక్షమున నయ్యవి తమకుఁగూడ నన్వయించునేమోయన్న భయముచేత విడిచి పెట్టినను పెట్టియుందురు. ఆవిషయ మలుండనిండు ఈ వీధినాటకము పై హేతు వులచేత వల్లభామాత్య విరచితము కాదేమో యని యెట్టి వానికిని సంది యము గలుగకమానదు. ఎట్లైనను అంతకుం గాకపోయినను గొంతవఱ కైనను శ్రీనాథుని చేయి యారచనమునఁ బాలుగొని యుండక పోదని, విశ్వసించవలసి వచ్చుచున్నది.


సీ. అలకాపు, బున నం గాత వర్ముఁడర్
గంధ్వపతికన్య కమలపాణి
యాదివ్యగంధర్వ కళావతారంబు
మధుమాపతోర్గంటీ మండలమున
నాసుందరాంగి దాక్షారామ మునఁబుట్టు
భువనమోహిని చిన్ని పోతియనఁగ
పట్టిసత్ స్త్రీజాతి యాసానికూతురు
చిర కాలమున సదాశివునికూడి
పొవనంబైన తమి లేటి సరసమున
పేగి కురువాటి కాదేశ విపినభూమి
గోవులను పేర చెంచులకులమునందు
గలీమిగిత్తుల యమ్మ నాఁ గలుఁగలదు.

అను పద్యములో . నుదాహరింపఁబడిన స్థలముల నన్నిటినీ జూచిన వాఁడేగాని మఱియొక్క, డిట్టి పద్యమును వాసి మధుమావతీ దేవి ?