ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

శ్రీనాథకవి

క్తీడాభిరామము

ఇది వీధి యను పేరంబరగిన యొక దృశ్య కావ్యము. ఇది దేశరూప

నాటక భేదములలో నొకటి. ఇది వినుకొండ వల్లభామా

త్యుని పేర శ్రీనాథుఁనిచే రచింపఁబడినదిగా దోచుచున్నది. వినుకొండ వల్లభ బాయఁడు నియోగి బ్రాహ్మణుడు. విశ్వామిత్ర గోత్రుఁడు; ఆశ్వలాయన సూత్రుఁడు; తిప్పనార్యుని పుత్రుడు. తిప్పనా ర్యుని ముత్తాతయైన చంద్రామాత్యుఁడు బుక్క రాజు నకు మంత్రియై నట్లుగా నీ క్రింది పద్యమునఁ చెప్పఁబషియుండెను,

శా, కర్ణాటక్షితీనాథుడెం పెదబుక్కక్ష్మాన్ దేవేంద్రున :
భ్యర్ణామాత్యుని దానశేఖారుడని ...బ్రాదీడు బంధుప్రియున్
వర్ణిచు గవి కోటి గందర జటావాటాతటారత్నదీ
స్వర్ణద్వంబుతరంగరంఖణలసత్సాహిత్యసాహిత్యమై

.


పల్లభరాయని పిన తాతయైన లింగమంత్రి హరిహరరాయల కొలువులోనుండి న ట్లీపద్యమునఁ దెలుపఁబడెను.

మ. కనకాద్రి ప్రతిమాన వైద్యనాధ లింగ క్ష్మాపమంత్రీంద్రుతో
ననతారాతినృపాలమంత్రి జనతాహంకారతారాహిమా
ర్కునితో రూపరతీద్రుతో హరిహరక్షోణీంద్ర సామ్రాజ్యవ
ర్దనుతోసాటి సమానమీడుగలా రాజన్యసైన్యాధిపుల్.


వల్లభ రాయనీ తండ్రియగు తిప్పన్న యను త్రిపురాంతక ముంత్రి కూడ హరిహరరాయల కొలువులోనుండి యాతని రత్న బాండార మున కధికారిగానుండెనని యాకింది పద్యమున దేలుపబడియె.

'సీ. సత్యవ్రతాచార సత్కీర్తి. గరిమల
జంద్రుతోడను హరిశ్చంద్రుతోడ
నాభిమానస్పూర్తి వైశ్వర్యమహిమను
రారాసుతోడ రేరాజుతోడ
సౌభాగ్యవైభవ జ్ఞానసంపదలను
మారుతోడ సనత్కుమారుతోడ