ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాధ్యాయము

187


కుళాదీశ్వర తెలుఁరాయని సందర్శించి యతని కంకితముగావల్లభాభ్యుదయమును జెప్పెనుగదా." అని వ్రాసియున్నారు. ఈవాక్యములను బట్టి చూడగా వల్లభాబ్యుదయము శ్రీకాకుళాంద్ర దేవుని యుత్సవములలో నడచు చుండెడు విస్వస్తాదుల దుర్వర్తనములుగలది యనియు అది యాంధ్ర విష్ణుదేవునకే యంకితమొనర్చ బడినదియు దెలియవచ్చుచున్నది." అని వ్రాసియున్నాడు. దీన్ని బట్టి వల్ల భాభ్యుదయము వల్లభామాత్యుని కంకితము చేయబడినమాట వ్యర్థమగుచున్నది. ఇంకను వీటికి కామకృష్ణకవిగారి వాక్యము లే యాధారములై యున్నవి. ఆగ్రంథమును జూడనిదే వారి వాక్యముల నాధారము చేసికొని సిద్ధాంతము చేయబూనిన బరిహాసాస్పదుల మగుటనిక్కము, రామకృష్ణకవిగారుతొమ్మిది సంవత్సరముల క్రిందట నాపీఠికను వ్రాసినారు. తరువాత వారొకప్పుడు నాతో నల్ల భాభ్యుదయమును శ్రీనాథుఁడు రచించినాఁడనితాము' వాసినది పొర బాటని చెప్పినట్లు నాకు జ్ఞప్తి యందున్న ది.వల్ల భాభ్యుదయము మనకు లభించినప్పుడుగాని యాగ్రంథముశ్రీనాథుడురచించినదియు, లేనిదియు నిర్ధారణము కాజాలదు. శ్రీమానవల్లి రామకృష్ణకవిగారు ప్రప్రథముమునఁ దమ పీఠికలలో కొన్ని పొరబాటభిప్రాయములను 'దెలిపినమాట వాస్తవము. భ్రమప్రమాదములచే నొకప్పుడు తప్పుటూహలు కలుగవచ్చును. విమర్శకులు వానిని నంధ ప్రాయముగా విశ్వసింపకపరిశీలించియథార్థవిషయమునుగ్రహించితక్కిసదిత్రోసిపుచ్చుచుండవలయును. నల్లేరు పై బండి పఱువిడునట్లుగా రామకృష్ణకవిగారి యభిప్రాయములను ఖండించుటకై పఱువిడుచుండెడి యాంధ్రకవిచరిత్ర కారుఁ డీయభిప్రాయమును తాము గ్రంథమును పోయినను ప్రేమపూర్వకముగా స్వీకరించుటకుఁ గారణ మందు విశ్వస్తాదుల దుర్వర్తనము లభివర్శింపఁబడి యున్న వని వారు నుడివిన వాక్యములేయై యుండును.