ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

శ్రీనాథకవి


శ్రీనాధుఁడు తన తాతను వారిధితటీ కొల్పట్టగా ధీశ్వరుండని భీమేశ్వర పురాణములోఁ జెప్పియుండు విషయమును విచారింతము,

తన తాత సముద్ర తీరమునందలి 'కాల్ ', అనుషట్టణమున కథిపతి యని చెప్పినాఁడు. ఇది పశ్చిమ సముద్రతీరపట్టణమై కర్ణాటములోఁ జేరి యుండునని యుమా కాంతము గారు వక్కాణించియున్నారు గాని యందులకుందగిన ఋజువు భారమును వహింప లేదు. 'కాల్పట్టణమనునది యెద్దియో నిర్ధారించి యయ్యది పశ్చిమ సముద్ర తీరమున నున్నదియో పూర్వ సముద్ర తీరమున నున్న డియో విస్పష్టముగాఁ దెలుపనలసి యుండును. కాఁబట్టి శ్రీనాథుడు తన తాతను గూర్చి చెప్పి సపద్యము సయితము శ్రీనా థుని జన్మభూమి కరాటమనటకుఁ జూలియుండ లేదు. మఱియు విన మత్కాకతి సార్వభౌము ' నని చెప్పియుండుటచేత కమలనాభామాత్యుడు కాక తీయాంధ్రచక్రవర్తి యైన ద్వితీయ ప్రతాపరుద్రుని కాలమునఁ గాల్పట్టగా ధీశ్వరుఁడుగ నుండెనని తేటపడుచున్నందునను "కాకతిసార్వభౌమునకుఁ బశ్చిమ తీరమునందు గిద్దెడు భూమియైనను లేనందునము కాల్పట్టణము తూర్పు సముద్రతీరమున నుండెననుట యొప్పుకునక తప్పదు. శ్రీనాథుఁడాంధ్ర దేశస్థుఁ డైన యాంధ్రుడు; శ్రీనాథుఁడాంధ్రుఁ డనియు, పాకనాఁటి నియోగి బ్రాహణుఁడనియు రెండు ప్రబలము లైన హేతు వులను జూపుచున్నాఁడను. భీమేశ్వరపురాణము సంకితమునొందిన బెండపూడి అన్నామాత్యుఁడు, శ్రీనాథుని

పాక నాటింటి వాఁడవు బాంధవుఁడవు
గమలనాభుని మనుమడ పమలమతిని'

అని ప్రశంసించియున్నట్లుగా నాగ్రంథమునఁ డెలిపియుండుటఁ జేత పాకనాఁటి నియోగి బ్రాహ్మణుఁడని విస్పష్టమగుచున్నదీ, అంతీయగాక కనులనాభుని మనుమఁడవనుటలో నొకవి 'శేషము పొడసూపుచున్నది. కమలనాభుఁడా' యన్న మంత్రికి జుట్టమని విస్పష్టము సేయుచున్నది, 'బాంధవుఁడను పదమే సమస్త సంశయములను నివారించుచున్నది. పాక