ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

శ్రీ నా థ కవి


చుచున్నది. ఈకాలమున శ్రీధుఁడు గంభీరహృదయమును జాటుచు దర్పమును బ్రకటించుచున్నవాఁడు గాని దైన్య భావమును సూచింపు చుండలేము అదియునుంగాక కన్నడ రాజ్యలక్ష్మికి నొక మహోత్కృష్ట విషయమును జ్ఞపై కిఁ దెచ్చుచున్నట్టు దయ లేదా నేను శ్రీనాథుఁడ! ' అనుదానివలనసువ్యక్త మగుచున్నది. అదివఱకుఁ గన్నడ రాజ్యలక్ష్మి కెఱకపడక క్రొత్తగఁ బోయిన వాడు దయలేదా? నేను శ్రీనాధుఁడన్ ” అని జ్ఞప్తికిఁ దెచ్చునట్లు సంభవింపదు. కనుక నీ పద్యము వార్ధక్యమున రెండవతూరి శ్రీనాథుడు కర్ణాట దేశమునకు, బోయిన కాలమునఁ జెప్పి సదై యుండవలయునని ప్రథమాధ్యాయముననేఁ జెప్పినట్టు ఓతల్లీ! కన్నడ రాజ్యలక్ష్మీ! అప్పుడే నన్ను మఱచిపోతివా ?లేదా? ఇచ్చట ముత్యాలశాలలో స్వర్ణాభి షేకమనుభ భవించిన శ్రీనాథుఁడడును జుమా' యని జ్ఞప్తికిఁ దెచ్చిన విషయముగా భావింపవలయునే గానిమఱియొక సుదర్భమునఁ జెప్పినదిగా భావింపరాదు. డిండిమభట్టారకుఁడుమొదలగువారు, తనకు రాయదర్శనము లభింపకుండ నడ్డుపడుచున్నారను విషయముఁ 'చెలియవచ్చినప్పుడు శ్రీనాథుఁడు మిక్కిలి దర్పమునుజూపుచు నీక్రిందిపద్యమును వ్రాసి పౌఢ దేవరాయలికి, బంపెసను విష యముగూడ నాయభిప్రాయమును బలపఱచునదిగా యున్నదిగాని ప్రభాకరశాస్త్రి గారి యభిప్రాయమును బలపఱచుచుండ లేదు.


 సీ. డంబుచూసినారా తలంబుపైదిరు గాడు
కవిమీఁదఁగాసనా కవచమేయ
దుష్ప్రప్రయోగంబుల దొరకొని చెప్పెడు
కవిశీరస్సునగాని కాలుచాప
సంగీత సాహిత్య సర్వి ద్విలొల్లని
కవులఱొమ్ములగాని కోల్చివీడువ
చదివి చెప్పగ లేక సభయందు విలసిల్లు
కవిపోరు గాని ప్రక్కల్పుదన్న