ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచభూధ్యాయము

173


పరంపరాగతముగా దక్షిణ దేశమునఁ జెప్పుకోనబడుచున్నది. వేదాంత దేశకులనాడు క్రీ. శ. 1270 మొదలుకొని 1320 వఱకు నుండుట చేత ప్రథమ డిండిమకవిసార్వభౌమునితో వాదింప లేదనుట స్పష్టము, శ్రీడాభిరామము పీఠికలో 'సాళువనరసింహ రాయల కాలములోనున్న మూడవ డిండీమకవిసార్వభౌముని నోడించెనని శ్రీమానవిల్లి రామ కృష్ణకవిగారు పొరపాటున వ్రాసియున్నారు. తరువాత శ్రీ వేటూరి పభాకరశాస్త్రిగారి కనకాభిషేకమను పొత్తము వెలువడినది. ఆగ్రంథ మును జదివిసపిమ్మట శామకృష్ణకవిగారు పొరపడితిమని నాతోఁ జెప్పియున్నారు. ప్రభాకరశాస్త్రి గారి వాక్యములనే నాయాంధ్రుల చరిత్రములో నుదాహరించి యున్నాను.

శ్రీ వీరేశలింగముగారు మాత్రము వీరి వాక్యములను మఱువక "సాళువగుండ నరసింహరాయలు 1450 వ సంవత్సరమునకు పైని 1450-90 సంవత్సన ప్రాంతములయం దుండిన వాఁడగుటచేతను, శ్రీనాథకవి 1450 వ సంవత్స రమునకు ముందే మృతినొంది యుండుట చేతను ఈకవిసార్వభౌమసనూర్జనకథ 1435 దవ సంవత్సర ప్రాంతమున రచింపఁబడిన 'కాశీ ఖండ రచనకుఁ బూర్వమునందే సడచియుండుటచేతను శ్రీనాథుఁడు సాళువగుండ నరసింహరాయు యాస్థానములో నుండిన డిండిమభట్టుతో వాదము చేసి జయించుట సంభవింప నేరదు. అని ఖం డించియున్నారు. రామకృష్ణకవిగారు క్రీడాభిరామపీఠిక వ్రాయునప్పటికి డిండిమభట్టారకుల చరిత్రము వెలువడి యుండ లేదు. వారి చరిత్రమును 'డెలిపి యందలి చిక్కును దొలఁగించినది శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రీ గారి కనకాభిషేక మను గ్రంథము. ఆ గ్రంథ సహాయమును గొని నే నాంధ్రులచరిత్రములో నీవిషయమును జర్చించినాఁడను. ఆకనకాభి షేక మును, ఈయాంధ్రుల చరిత్రమును బయలు-వెడలిన తరువాత నాంధ్ర కవుల చరిత్రములో రామకృష్ణకవిగారి యభిప్రాయములను ఖండన