ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

శ్రీనాథకవి


1428 వ సంవత్సరమున లిఖింపబడినది. కావున నీధర్మకార్యములు భీమఖండములో నుదాహరింపఁబడినవి కావున నాగ్రంథము కాలమునకు తరువాతనే రచియింపఁబడినదన స్పష్టము.


శ్రీ నాథుని కనకాభి షేకము.

పెదకోమటి వేమభూపాలుని యనంతర మైదారుసంవత్సరము కాలము తెలుఁగు రాయఁడు, మైలార రెడ్డి మొదలగు వారలకడఁ గాల మును గడపి పిమ్మట నీతఁడు కర్ణాట రాజధానికి బోయెనని కొందరు చెప్పుదురు. "నేనాధ్రుల చరిత్రములో దేవరాయమహా రాయలు కర్ణాట సామాజ్యాధిపత్యము వహించియున్న కాలమున శ్రీనాథ మహాకవి 'పెదకోమటి వేమభూపాలునికడ విద్యాధి కారిగ నుండియుఁ గర్ణాటరాజ ధానియగు విద్యానగర మను నామాంతరముగల విజయనగరమును జూడఁబోయేను. కర్ణాటసింహాసనాధ్యక్షుఁ డగు దేవరాయ లీయఖండ పండితుని సన్మానించి నివాసస్థలం బెయ్యది యని ప్రశ్నింపఁగా నీత "డీక్రిందిపద్యమును జదివెనఁట.."


సీ. పగరాజగిరి దుర్గవర వై భవశ్రీల
గొనకోని చెడ నాడుకోండవీడు
పరిపంది రాజన్య బలములబంధించి
కొమరుమించిన బోడుకొండవీడు
ముగురు రాజులకును 'మోహంబుఁ బుట్టించు
గుఱుతైన యురితాడు కొండవీడు
చటులవి క్రమకళా సాహసంబొనరించు
కుటీలాత్ములకు గాడు కొండవీడు

గీ. జనన ఘోటక సామంత సరసవీక
భటనటా నేక హాటక ప్రకటగంధ
సింధుగా రావ మోహన శ్రీలఁదనము
కూర్మి నమరావతికి జోడు కొండవీడు,

అని వాసీయున్నాడ. పెదకోమటి వేమవిభుని ,మరణానంతరము