ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాధ్యాయము


ముందుగ ద్రావిడ దేశముపై డండ యాత్ర వెడలెకు. ఈ దండయాత్ర 1360- 65 సంవత్సకములలోజరిగియుండును. ఇతఁ డసంఖ్యాకముగు సైన్యములతో మొగిలి కసమ మార్గముగఁ బాలేరునది యొడ్డునున్న విరించిపురమునకు బోయి దండువిడిచెను. ఈసమాచారమును సాంప రా యలు విని పా లేరుకునదిని దాటి తన రాజ్యములోఁ బ్రవేశింపకుండ విశేష సైన్యములతో కప్పుకొని విరించిపురము కడ ఘోరయుద్ధమును సలిగానీ యాంధ్రకర్ణాటకులతో బోరాడఁ జాలక ద్రావిడసైన్యములు పలాయనముకాగాఁ సాంపరాయలును పలాయనుఁడై పడవీటి వైపునకు బాఱీపోయి స్వల్ప సైన్యములో రాజగంభీపర్వతమును శరణ్యముగా జేసికొని తగురక్షణ చేసికొనుచుండెను గాని విజయనగర సైన్యములు వెంటాడించి రాజగంభీర పర్వతమును (పడవీ సుదుర్గమునకు నామాంత రము) ముట్టడించినవి. రాజగంభీర సాంపరాయలను నాతఁడు శా. శ.1180

లో పరిపాలనము చేయుచున్న మూఁడవ రాజు రాజను చోళ

రాజునకు సామంతుఁడుగ నుండెను. అతని పేరిటనే పడవీడు దుర్గమునకు 'రాజగంభీరమల' యని నానుము గలిగినది. అతని వంశమునందే కంప భూపతితో సమకాలికుఁడగు రాజనారాయణ సాంబువరాయలు జనించి రాజగంభీజీ రాజ్యమును (తుండీరమండనమును లేక తొండైమండలమును), పరిపాలించుచుండెను. విజయనగర సైన్యములు పడవీదుర్గమును ముట్ట డించినప్పుడు మరలవారలకు భయంకరమైన యుద్ధము జరెగెను. ఈ యుద్ధములో సాంప రాయలు కంపభూపతిచేఁ జంపఁబడినటులు గంగా దేవి విరచితమైన మధురవిజయము లేక కంపరాయచరిత్రము వలనఁ దెలియు చున్నది. కాని సంస్కృత కావ్యము లగు రామాభ్యుదయము, సాళువా భ్యుదయము, ఆంధ్ర కాన్యములగు జైమినీభారతమును వరాహపురాణమును సాంప రాయలు పరాజితుఁడై వేడగా విజయనగర సైన్యాధిపతులలో నొక్కఁడగు సాశ్వమంగరాజు వానిని మరల సామ్రాజ్యమున

20