ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాధ్యాయము

146


ఈ గన్నభూపాలునింటి పేరు దంతులూరి వారు. వీని మూలపురుషుఁడు ధనంజయు గోత్రులైన (కోట) కేతరాజు 'మొదలగువారు కాకతీయ రాజులతోను, చందనోలు రాజులతోను సంబంధ బాంధవ్యములు గలిగి రాచవారని ప్రఖ్యాతి గాంచియున్నారు. వీరు మొదట చతుర్థ కుల సంపన్నులుగాఁ బరిగణింపఁబడినను రాను రాను రాచవారను నొక శాఖవారుగ నేర్పడిరి. అట్టికుటుంబములతో జేరిన వారొకరు డంతు లూరు నందుండుటచే వానింబట్టి దంతులూరివారను నింటి పేరు కలిగినది. దంతులూరి గన్న భూపాలుడు రాచవేమునకు మాతామహుఁడనియు, పెదకోమటి వేమభూపాలుని కాలమున ధాన్య వాటిపురా(ధరణికోట) ధిపతిగ నుండిన యొక సేనాని. ఇతఁడే శ్రీనాధ కవి వర్యునిచేధనంజయ విజయమను కావ్యమును గృతినొందెనను విషయము దంతులూరి బాపిరాజకవి ప్రణీతమైన మూర్తి త్రయోపాఖ్యానము సందలియీకింది పద్యము:నలనఁ దేటపడుచున్నది.


సీ. ఆహిత దుర్గాధ్యక్షు లందఱుధయమంద
గ్రీడి కైవడినిల్చెఁ దాడి నాడ
నక్షుద్ర దాన విద్యాక్షేత్రముల చేతఁ
బ్రతిమెవ్వడును లే ప్రతిభగాంచె
దనకీర్తిదశదిగంఅదగీయమానమై
కనుపట్టధర్మమార్గంబు నెఱపె
శ్రీ నాధసుకవీంద్రుచే ధనుంజయ విజ
యంబనుసత్కావ్యమంది వెలెసె
సృపతి మాత్రుడే నిజపాదనీర జాత
ఘటిత కోటీర వైరి భూ కాంత మాన
సాంతర భయాపహారి శ్రీదంలూరి
గన్న భూపాల మౌళిళ దోగ్గర్వశాలి"

దీనిని దెలిసికొని వీరేశలింగముగారు తమకవుల చరిత్రములో " నీక్రింది విధముగా శ్రీనాథుని నెత్తిపొడిచియున్నారు