ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాధ్యాయము


తము మనుజపతులని వీరేశలింగమువంటివారే శ్లాఘించుచు వానిని మఱచి శ్రీనాథుని నధిక్షేపించుట నాకంత సరసముగాఁ గన్పట్ట లేదు. అవచి తిప్పయ సెట్టి పూర్వులు చాలఁ బ్రసిద్ధిగాంచిన వారైనట్లుగా నీక్రిందిపద్యములోఁ జెప్పీయున్నాడు.

సీ.కట్టించె నొక తాత కంచిహ్నర్మ్యంబులు
హరిణా కధూళిఫ్ కేకార్క
బాలార్క మనియెడి పద్మరాగముదాచె
నొక తాత కంచీ నాయకుని నాభి
నొక తాతఁ గట్టిం చె యోగిశ్రయ ధీర్ఘ
తరతటా కాంబోజ తరువకు
గావేరి గట్టించెఁ గార్పా సరాసుల
నుబ్బి రోడఁడు మెచ్చ నొక్క తాత

గీ.ప్రతిదినమ్ములగపు పు పములు వేయు
మతము గా నొక్క తాత యీశ్వరునికొసఁఘే
నిభలలోక ప్రసిద్ధ వాణిజ్య వంశ
ధరులు మా తాత లుభయగోత్రములవారు.

ఈతిప్పయ సెట్టియు వీనితమ్ములు తిరుమలనాధ సెట్టియుసు జామీ సెట్టియును నౌకాయాత్రలం చేయుచు విదేశములతో వ్యాపారముసేయుచుఁగడుఁ బ్రఖ్యాతిగాంచిన వారని హరవిలాస పీఠికలోని యీక్రింది పద్యముల వలనఁ దేటపడుచున్నది .

సీ. పంజాబు కర్పూర పాదపంబులు దెచ్చి
జలమోగి బంగారు మొలక దెచ్చి
సింహారంబున గంధ సింధురంబులు దెచ్చి
హరుమంజి బులు తేటి హరులు దెచ్చి
గోవసంశుద్ధ సంకుమదద్రవము దెచ్చి
యాపఁగ నాణిముత్యాలు తెచ్చి
చోటంగికిస్తూరిరు కాటంకములు దెచ్చి
చీని చీనాంబర శ్రేణి దెచ్చి