ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథకవి


నడిమి కాలమునరచింపబడెసని చెప్పవచ్చును. మఱియు నీ రెండునుశైవులకు ప్రధానములైన మతగ్రంథములు గావున శైవుఁడైన తిప్పయసెట్టికీ హరః లాసము నంకితము సేయుచు శై పగ్రఁథములను బేర్కొనక శృంగారనైషధమును మాత్రము పేర్కొనుట చూడగా నారెంటికిని పూర్వమె హరవిలాసము రచించియుండె ననుట విశ్వసింపవలసి వచ్చుచున్నది. మఱియును

ము.ఖుసీమీరన్ సురధాణీనిండు కొలువై గూర్చున్నచో నీశరా
భ్యసనంబులున్నుతి యించుగా యవచి తిప్పాచంద్ర సారంగ నా
బిసముత్పాదిత తాళవృంతపవన ప్రేంఖోలన ప్రక్రియా
నసరోదంచిత సారసౌరిభరసన్యాలలోల గోలంబులన్.


ఈపద్యములోఁ బేర్కొనఁబడిన సురధాణి ఫిరోజిషాహా ఇతఁడు 1422 వఱకుఁ
బరిపొలనము చేసిన వాఁడుగావున హరవిలాసము రచించునాటికి ఫిరో జిజహా బ్రతికియుండెనని చెప్పవచ్చును. అనఁగా పెద్దకోమటి వేముని మరణాంతరమున ఫిరోజసాహ మరణమునకుఁ బూర్వమును హరవిలాసము రచింపఁబడి యుండుననుట సందేహము లేదు. హరవిలాసము పీఠికలో --

<poem> క. కంటీని విశుద్ధసంతతి
వింటీబురాణములు "ఫెక్ట్కు విశ్వము వొగడన్
నుంటి బహువత్సరంబులు
గొంటీ యశోధనము సుకవికోటి నుతింపన్


అని తిప్పయ పెట్టి చెప్పుకొనియుండుటచేత 60 , సంవత్సరములు వయస్సు చెల్లినవాడై యుండెననుటకు సందేహము లేదు. కుమారగిరి రెడ్డి సుగంధ భాండాగారాధ్యక్షు, డైయున్న యవచితిప్పయతోడ శ్రీనాథుడు బాలుఁడుగానున్న కాలమున మైత్రికలిగి యుండవచ్చును. అనఁగా దిప్పయ సెట్టికిని శ్రీనాథునకును వయస్సులో 20 సంవత్సరము భేద ముండునని యూహింపవచ్చును. ఇదియే నిశ్చయమైనయెడల హరవిలా సరచనకాలము నాటికి శ్రీనాథునకు 45సంవత్సరములకన్న నెక్కువ