ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాధ్యాయము


వఱ కే యుండిన యొక శిథిల తాళపత్ర గ్రంథము దొరకినందులకు మిగుల సంతసించి తుట్టతుద వఱకు ముద్రింపించితిమి. యథామతిఁ బరిష్కరిం చినను నిందుఁ గొన్ని స్టాలిత్యము: లింకను నుండవచ్చును గాన వానిమన్నించుటకు బండితులను వేడు కొనుచున్నాను."

పీఠిక భౌగమగల ప్రతియొక్కటియె దొరకుటను బట్టి హరవిలాసము గొన్ని సాలిత్యములకు లోనయి యుండునన్న సచ్చెరువొందుబని లేదు. ఇందు ముందుగా విచారించవలసిన గొప్ప సందేహము తిప్పయ పెట్టి ప్రోలయ వేనూ రెడ్డి కాలములో వ్యాపారముఖ్యుడుగా నున్న వాఁడాయనునది. ఇది వఱకు ముద్రిత గ్రంథములోని తృతీయ శ్వాసము మొదటనున్న,


క. శ్రీపర్వతసోపాన
స్థాపక "వేము క్షితీశ సామ్రాజ్యం
హ్యాపారిను ఖ్య యంవయ
దీపక యలకాధీ రాజీ దేవయతిప్పా,


అనుపద్య పాఠమే సరియైన దైన 'యెడల స్థిర సిద్ధాంతము లనేకములకు ప్రతిబంధక మగుచున్నది. ఆవిషయమును బూర్వ ప్రకరణమునఁహరవిలాసముజర్చించి యున్నాఁడను. శ్రీకృష్ణ రావు బహదరుగారు హరవిలాసమునకు వ్రాసిన పీఠికలో


క. శ్రీపర్వతసోపాన
స్థాపక వేమక్షితీశ సామ్రాజ్య శ్రీ
వ్యాపాముఖ్య సత్కుల
దీపికప యలకాధి రాజ దేవయతిప్పా


అని దిద్దినచోఁ దిప్పన తండ్రియగు దేవయ వేమా రెడ్డి కాలము లోని వాడనియు . . . . . .కొమరగిరిభూపాలునికాలము నాటివాఁడు తిప్పం డనియుఁ,, ననీ సూచించి యున్నారు, అట్టి మార్పువలన మార్గము గొంతవరకు సుగమముగానుండు నసుటకు సందేహము లేదు. మనము