ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథ కవి


వింతగాగన్పట్టదా..కలువచేఱు శాసనముం బ్రకటించిన శ్రీ జయంతి రామయ్య గారు పరహితుఁడు కాళనాధునితనయుఁడు ప్రకృతముశాస నస్వామియగు కాళనాథభట్ల సుబ్రహ్మణ్యముగారీ కాళనాథుని వంశ ములోని వాడనియు, కాళనాథభట్ల వారను నింటి పేరీ కాళ నాధుని బట్టియే వారికీ వచ్చెననియు నూహింపఁదగి యున్నది. వీరు కాసలనాటి వారు. వీరిది. భారద్వాజసగోత్రము. యజుశ్శాఖ వీడియింట వైద్యవిద్య నేటికిని గలదట. * అని వాసి విమర్శలో తప్పుతోవదీసిరి. వీరి వాక్యములను విశ్వసించి ప్రభాకరశాస్త్రీగారు కూడ శాసనముల విమర్శింపక పంజరములోని కీరమువలె రామయ్య గారి పలుకే పలికిరి. రామయ్య గారి యూహసరియైనది కాదు. కాసలనాటి శాఖవారై న కాళనాధభట్ల సుబ్రహ్మణ్యముగాకు కలుసచేఱు శాసనములోని నాధుని వంశములోనివారుగారుట స్పష్టము. వీరిది భారద్వాజ గోత్రము వానీది యాత్రేయనగోత్రము'. కాళవాధభట్ల యను నింటి పేరుగల వారొక్క. కాసలనాటి శాఖ వారిలోనే గాక యాంధ్ర దేశమున నీతరశా ఖల వారిలోఁగూడ నున్నవారు. కావున రామయ్యగారి యూహసరి యైనది కాదని చెప్పక తప్పదు. పొన్ను పల్లి శాసనములోని భస్కరా ర్యుఁడును, కలువచేఱుశాసనములోని పరహి తాచార్యుఁడును కప్ప పొము కథకు సంబంధించిన పరహితువంశశములో జనియించినవారే యుండ నొకరిని 'F శ్యప.గోత్రనిగాను. మఱియొకని నాత్రేయ గోత్రుని గాను భిన్న గోత్రులుగాఁ జెప్పుటకుఁ గారణము గనుపట్టదు. ఆంధ్ర దేశమున బాహ్మణులలో నేక గోత్రముగలవారి వంశనామములు వేర్వేరుగ నుండుట గనంబడునుగాని యొకపురుషుని వంశములోని వారు భిన్న ఋషి.గోత్ర ములలోఁ బరగిన వారిని బాహ్మణులలో నేను గనుగొని యుండ లేదు. ఇదియే ప్రథమమున నాకన్నులకుఁ దట్టింది. 'పొన్ను పల్లి శాసనములో మూల పురుషుఁడయిన పరహీతుని గూర్చిన కథ. కలువచేఱుశాసనములో వివరణముతోఁ గూడి యిట్లున్నది.