ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాధ్యాయము

119

బరిశోధించి సిద్ధాంతీక గానంబకు

వర్ణించుటకు విజయనగర సామ్రాజ్యము పైని, ఏతచ్చక్రవర్తుల పైని, జన్మభూమి పయిన నెద్దియేని ద్వేషము ఫుట్టినఁగాక వేరు కారణము చెప్పు రాదు. అదియునుంగాక విద్యారణ్యులు డిండీమకవి సార్వభౌముఁడు నేక కాలమున విద్యానగరమున నున్న వారుగారు. ఈ విషయముఁ జక్కగా బరిసోదించి సిద్ధాంతీకరించిన ప్రభాకరశాస్త్రిగారు సమున్వముముకు సమ ర్ధింపఁజూలము. ఎట్లయిన నేమి? పెదకోమటి వేముని ఆస్థానకవీశ్వరుం డుగానుండెనని తెలిసికొనఁగలుగుచున్నారము. వేమభూపాల చరితము గద్య కావ్యము పఖ్మాత, డైన బట్ట బాణుని మార్గము ననుసరించి యీతఁడేగద్య కావ్యమును గచించెను. ఈ వేమ భూపాలచరిత్రమున వేమ భూపాలుని నంత్యత్యచరిత్రమును దెలుపువిషయము లంత గాఁ గానరావు, గాని దాక్షారామ వేశ్యావర్ణనము మాత్ర మెక్కువగా గానంబడుచున్నది. కోమటి వేముఁడీగ్రంధమునందు, సరసకవి కావ్యశరణభూషణేన కళా ప్రతిదినమలం కుర్వన్' అని వర్ణింపఁబడియుండుటచేత ప్రభాకర శాస్త్రి గారు శ్రీనాథుఁడు సరసకవులలో నగగణ్యుఁడవును గదా యను చున్నారు. వామనభట్ట బాణుఁడుగూడ నందగగణ్యుఁడు గాఁడా! "శ్రీనాథుని వలె దాక్షా రామ వేశ్యావర్ణన మెక్కువగా జేసి యుండినవాడే గదా.

మఱియు గంధోంతమం దీశ్లోకమున్నది. శ్లో. సుగుణాలంకృతి శుభ గా సుకృతి లయం కట్టబాణభవ . అధరయతి, ధులే సముఖత kణా సాగా దమాధుశ్యామ్,

ఇది వామన భట్ట బాణుని రచనము కాగూడదనియు, మఱియొక కవి యాతనిఁ బ్రశంసించుచుఁ జెప్పీ నదనియు ఇయ్యది శ్రీనాథుఁడు చెప్పి నవనియు వారియభి ప్రాయము. శ్రీనాథు: కు చెప్పిన యీశ్లోకమును దన ప్రఖ్యాతికై తనగంధములొనర నలంకరించుకోని యుండె.ముగాఁబోలు! వామనభట్ట బాణుఁడు. ఇంతకుముందు దాహరింపబడిన హరవిలాపము లోనిపద్యమె యీతలంపునకు సాధకమని నాము "సుత్రులగు శాస్త్రి గారు దెఖుపుచున్నారు. అట్లయినయెడల సకల విద్యాసనాథుఁడగు శ్రీనాథుఁడు