ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాధ్యాయము

107


పెద్దనిండుసున్న పెట్టి తాటియాకు కవిలెకట్టు మోయు గుమస్తా కంకితము చేసెనను భావమునుదెల్చుచు నాకాశ పంచాంగము విన్పించెడి లక్ష్మణ రావు గారి పల్కులు విశ్వాసార్హము లెట్లగును? ఆపల్కులనే చిలుకవలే రెట్టించి పల్కెడి కవిచరిత్ర కారుని పల్కు లెట్లాదరణీయము లగును? సింగనామాత్యుఁడు కొండవీటి సామ్రాజ్యాధీశ్వరుడైన పెదకో మటి వేమభూ పొలుని మంత్రులలోఁ బ్రధాన శేఖరుండగుటచేతనే సక లవిద్యాసనాథుడైన శ్రీనాథుఁడు సింగనామాత్యుని కొల్వుకూటము నిట్ల భివర్ణించి యుండెను. "

“వృదుమధుర చిత్ర విస్తరకవితా విలాస వాగీశ్వరులగు కవీశ్వరు లుసు, పతంజలి కణాదాక్షచరణ పక్షిలాది శాస్త్ర సిద్ధాంతకమలవహం నులగు విద్వాంసులును భరతమతందత్తిల కోహలాంజనేయ ప్రణీత సంగీత విద్యారహస్య విజ్ఞాన వై జ్ఞానిక స్వాంతులగు కళావంతులును, శక్తి త్రయచతురు పొయషాడ్గుణ్య ప్రయోగయోగ్య విచారులగురాయ బారులును నిఖిల పురాణేతిహాససంహితా తాత్పర్య పర్యాలోచనాధు రంధరధిషణాసము త్సాహంబగు పౌరాణిక సమూహంబును బరి వేష్టింప గొలువుండి,"

ఇట్లు విద్వద్య్బృదముతో కోలువుదీర్చిన సింగనామాత్యుఁడు కవిలెకట్టలు మోయు గుమస్తాయని పల్కుటకు నాకునోరాడదు.అయినను ఈసింగనామాత్యుని తండ్రి పెద్దనామాత్యుడు అన వేమభూపాలు సకు మంత్రిగనుండె ననియు అనవేమభూపాలుఁడు కొఁడవీటి సామ్రా జ్యమున కవీశ్వరుడనియు శ్రీలక్మణరావుగారును శ్రీవీరేశలింగముగారు నుగూడ నొప్పుకొని యేయున్నారు. అటువంటి పెద్దనామాత్యుని పుత్రు డైన సింగనామాత్యుఁ డతనికంటెను ఖ్యాతుఁడై యుండెననుటను బై వర్ణనములు వేనోళ్ళ జాటుచున్నవికాని యతిశయోక్తులని గన్పట్టు చుండ లేదు. ఇదియునుం గాక సింగనామాత్యుని యన్నలగు వేమయా మాత్యుని ప్రగడనామాత్యుని దండనాథులనుగా వర్ణించియున్నాడు