ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

శ్రీ నాథ కవి


ర్వముగా వేమభూవరుడాతనికి వివిధాగ్రహారములతో, బాటు అందళము, ఛత్రము, చామరము (వీచోపులు), బంగారు తమ్మపడిగముమొదలుగా గలసమ్మానార్హ చిహ్నములు లొసెంగెనని గహింపవలయును. మఱియు షష్ఠ్యంతములలో నాతని గూర్చి


శ్రీ మహిత పెద్దకోమటి
వేమక్షితి పాల రాజ్యవిభవకళా
క్షామణికి సింగ సచిన
ఫ్రామణికిం బాండ్య రాజుగజ 'కేసరికిన్ .

అనియుఁగూడఁజెప్పి యున్నాఁడు. కాఁబట్టి యాసింగనామాత్యుని మహా ప్రధాన శేఖరునిగాఁ జెప్పియున్నందునఁ బెదకోమటి వేమభూవ రుఁడు కొండవీటి సామ్రాజ్యమునకుఁ బట్టాభిషిక్తుఁడైన వెనుకనే యీ శృంగార నైషధము సింగనామాత్యున కంకితము చేయఁబడియెనని యూ హింపవలయును. ఇంతకన్న విస్పష్టముగా ద్వితీయాశ్వాసాదియందిట్లున్నది


క. శ్రీ రాజరాజ వేమ
క్ష్మారమణ కృపాకటాక్ష సంవర్థి తల
క్ష్మిరక్షితబుధ లోక యు
దారగుణాధార సింగ నామాత్యమణీ.


శ్రీనాధుడీ పై పద్యమునందు రాజాధి రాజైన 'వేమభూపాలుని కరుణతోడి కడకంటి చూపు చేత 'పెంపఁబడిన సంపద చేత పోషింపఁ బడిన విద్వాంసు లసమూహము కలవాఁడాయని సింగనామాత్యుని సంబోధించినాఁడు. పెదకోమటి వేముఁడు కొండవీటి సామ్రాజ్యమున కభిషిక్తుడైన వెనుక నే యీశృంగార నై షధము సింగనామాత్యుని కఁకితముచేయఁబడియెనని

తెలుపుటకీ నిదర్శనములు చాలవా? వీటినన్నిటిని నతిశ యోక్తులని[1]

  1. *ముద్రితగంధములలో శ్రీమహిత పెద్దకోమటి' యను దానికి బదులు గా శ్రీ మహితు "పెద్దసుతునకు ' అని యున్నది. చరిత్రము తెలియనందున బెద్దకోమటీ .'యనుగాని యర్ధము తెలిసికొనజాలక తప్పనుకోని శృంగార నైషధమును ప్రథమమున వారట్టిమార్పు చేసి యుందురు.